‘కడుపునిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద ఓదిలిపెడితే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహరం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే’ ఇదీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ ని ఓపెనింగ్ డైలాగ్. ఎంతగానో ఎదురుచూసిన ఈ ట్రైలర్ ఎట్టకేలకు పలకరించింది. రెండు నిమిషాల నలభై సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేశాలా సాగింది.
ట్రైలర్ లో కథ, కాన్ఫిఫ్లిక్ట్ ని పెద్ద పరిచయం చేయలేదు కానీ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో చరణ్ పాత్రకు చాలా షేడ్స్ వున్నాయి. స్టూడెంట్, పోలీస్, ఐఎఎస్, పొలిటికల్ లీడర్ తో పాటు ఇంకొన్ని వేరియేషన్స్ ఆ పాత్రలో కనిపించాయి. ప్రతి షేడ్, గెటప్ లో చరణ్ మేకోవర్ చాలా కొత్తగా వుంది. ముఖ్యంగా పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ లో చరణ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది.
ముఖ్యమంత్రి బొబ్బిలి మోపిదేవి పాత్రలో ఎస్జే సూర్య ఆసక్తిని పెంచారు, టీజర్ లో వినిపించిన ‘ఏం చేసాడ్రా వాడు’ అనే డైలాగ్ ని ట్రైలర్ లో కూడా చూపించారు. ఆ డైలాగ్ అంత గుచ్చి గుచ్చి చెప్పడంతో ఖచ్చితంగా ఊహకు మించినదేదో కథానాయకుడు చేయబోతున్నాడనే హింట్ ఇచ్చారు.
కీయరా కంటే అంజలి పాత్రకు ప్రాధాన్యత వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. శ్రీకాంత్, సునీల్, వెన్నెల కిషోర్ పాత్రలు ట్రైలర్ లో చోటు దక్కింది. తమన్ నేపధ్య సంగీతం, కెమరాపతనం, ప్రొడక్షన్ వాల్యూస్..అన్నీ శంకర్ విజన్ కి తగ్గట్టుగా గ్రాండ్ గా వున్నాయి.
‘నివ్వు ఐదేళ్ళు మంత్రివి, నేను చనిపోయేవరకూ ఐఎఎస్ ని’అని చరణ్ చెప్పే డైలాగ్ వింటే రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రసీ కాన్ఫ్లిట్ తో శంకర్ ఈ కథని తయారు చేశారని అర్ధమౌతోంది. ట్రైలర్ కొన్ని విజల్స్ పడే మూమెంట్స్ వున్నాయి. చివర్లో లుంగీ కట్టుకొని హెలీ క్యాప్టర్ లో దిగే సీన్ అయితే అదిరిపోయింది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేలా వుంది.