కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రకటించడమే కాదు.. ఆ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తనతో పాటు.. కొంత మందిని తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత మంది వెళ్తారో కానీ… ఆయన సోదరుడు.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం… వెళ్లడం లేదు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ అవుతోంది. తాను మాత్రం తుది శ్వాస వరకు.. కాంగ్రెస్‌లోనే ఉంటానంటున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మధ్య విబేధాలొచ్చాయా..?
కోమటిరెడ్డి సోదరులు.. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ముందుగా.. నేతగా ఎదిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన వైఎస్‌కు అత్యంత దగ్గరివాడిగా మెలిగి.. ఆయన సోదరుడైన.. రాజగోపాల్‌రెడ్డికి రాజకీయ అవకాశాలు కల్పించారు. వైఎస్ హయాంలో భువనగిరి ఎంపీగా టిక్కెట్ ఇప్పించడమే కాదు.. గెలిపించారు కూడా. అలా రాజకీయ ఆరంగేట్రం చేసిన రాజగోపాల్ రెడ్డి.. కొంత కాలం నుంచి అన్న కంటే ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాపై.. అలాగే వివాదాస్పద ప్రకటనలు చేసి.. కలకలం రేపారు. ఎలాగో సద్దుమణిగిపోయింది. ఇప్పుడు నేరుగా బీజేపీలోకి వెళ్లేందుకు అవే తరహా ప్రకటనలు చేశారు. ఈ సారి ఆగే పరిస్థితి లేదు.
పీసీసీ పీఠం కోసం అలా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా..?
నిజానికి కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారు. అదీ కూడా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లే వింటారు. ఆయన రాజకీయ బాటలోనే పయనిస్తారు. సొంత రాజకీయాలను దాదాపుగా చేయరు. ఇప్పుడు కూడా.. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి పంపడం.. అనేది.. వెంకటరెడ్డి ప్లానేనన్న గుసగుసలు కాంగ్రెస్‌లోనే గట్టిగా వినిపిస్తున్నాయి. తనకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వకపోతే.. తాను కూడా.. అలాగే వెళ్తానన్న సందేశాన్ని.. మెల్లగా.. కాంగ్రెస్ హైకమాండ్లోకి పంపడానికి ఈ ప్రణాళిక వేశారన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో .. కానీ.. వెంకటరెడ్డి మాత్రం.. పార్టీపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. తుదిశ్వాస వరకూ.. పార్టీలోనే ఉంటానంటున్నారు. ఓ వైపు .. సోదరుడ్ని పక్కపార్టీలోకి పంపుతూ… తాను మాత్రం కాంగ్రెస్‌పై విశ్వాశాన్ని ప్రకటిస్తూండటంతో.. ఇదే డబుల్ గేమ్ అన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడిపోయింది.
ఇప్పుడు తాత్కలిక ప్రయోజనాలు..! చివరికి ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటే ఆ పార్టీలో..?
రాజకీయాలే కాదు.. రాజకీయ నేతలు కూడా డైనమిక్‌గా మారిపోయారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉండటం… కోసం లోపాయికారీ వ్యవహారాలు నడుపుతున్నారు. వెసులుబాటు ఉన్న చోట్ల కుటుంబసభ్యులను ఆ పార్టీలోకి పంపుతున్నారు. కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండటం… వింత కాదు కదా.. అనే… ఆన్సర్ రెడీగానే ఉంటోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ వ్యాపార ప్రయోజనాలను రక్షించుకోవడానికి.. ఇప్పుడు బీజేపీ అవసరం ఉంది. మళ్లీ ఎన్నికల నాటికి… పదేళ్ల ప్రభుత్వం వెల్లువలా కనిపిస్తే… కాంగ్రెస్‌లో ఎలాగూ.. వెంకటరెడ్డి ఉంటారు. లేదు.. కాంగ్రెస్ లేవలేదని బావిస్తున్నారు. ఎలాగూ సోదరుడు బీజేపీలో కర్చీఫ్ వేసి ఉంటారు. అందుకే.. మొత్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం… .. అచ్చంగా రాజకీయంగానే చేస్తున్నారంటున్నారు.