గ్యాంగ్ లీడర్… చిరంజీవి కెరీర్లోనే కాదు, తెలుగు చలన చిత్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గ సినిమా. చిరంజీవిని మాస్‌కి మరింత దగ్గర చేసిన సినిమా. మాస్ సినిమానే అయినా, ఫ్యామిలీ ఎమోషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. చిరంజీవికి సోదరులుగా మురళీమోహన్, శరత్ కుమార్ నటించారు. ఆ తరవాత.. చిరు, మురళీ మోహన్, శరత్ కుమార్ కలిసి నటించిన సందర్భమే లేదు. అయితే.. ఇప్పుడు ఈ ముగ్గురూ ఓ చోట కలిశారు. `గ్యాంగ్ లీడర్`.. నాటి సంగతుల్ని మరోసారి నెమరేసుకున్నారు.
ఆచార్య షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది, అక్కడే… మురళీమోహన్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అందులో.. శరత్ కుమార్ కీలకపాత్రధారి. ఆ షూటింగ్ కూడా… రామోజీ ఫిల్మ్‌సిటీలోనే. అందుకే… శరత్ కుమార్, మురళీమోహన్ కలిసి.. ఆచార్య సెట్‌కి వెళ్లి… చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలై.. ఇటీవలే 30 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే.. అలనాటి సంగతులన్నీ ఈ ముగ్గురూ మరోసారి ముచ్చటించుకున్నారు. కలిసి ఓ ఫొటో తీసుకుని.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్యాంగ్ లీడర్ ని రీమేక్ చేస్తే బాగుంటుందని మెగా అభిమానుల కోరిక. ఈ సందర్భంగా రీమేక్ కి సంబంధించిన బీజమేదో చిరు మైండ్ లో పడే ఉంటుంది.