హైదరాబాద్: ఒక అగ్రస్థాయి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 24 ఏళ్ళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఆమె సహోద్యోగి, అతని నలుగురు మిత్రులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఆమెకు సహోద్యోగి రెస్టారెంట్లో మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి, అక్కడనుంచి ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్ళి తన మిత్రులు నలుగురితో అత్యాచారం జరిపినట్లు బయటపడింది. ఆ అపార్ట్మెంట్ ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ది కావటం విశేషం. నిందితులు ఐదుగురినీ, ఆ అపార్ట్మెంట్ యజమానురాలిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్ళేటప్పటికి ఆ ఆరుగురూ ఇంకా పార్టీ చేసుకుంటూనే ఉన్నారట.
బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితురాలు పనిచేసే కార్యాలయంలో శనివారం సాయంత్రం ఒక పార్టీ ఉందని, ఆ పార్టీకి వెళుతూ మార్గమధ్యంలో ఒక రెస్టారెంట్ వద్ద బాధితురాలు, ఆమె స్నేహితుడు ఆగారని, అక్కడ అతను ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడని పోలీసులు చెబుతున్నారు.