విశాఖలో మరో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికపై పది మంది కీచకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మిస్సింగ్ కేసు నమోదవడంతో కేసు బయటకు వచ్చింది. విశాఖలో రైల్వే న్యూకాలనీలో ఓ కుటుంబం పెంపుడు జంతువులను చూసుకునేందుకు ఒడిశాకు చెందిన ఓ బాలికను పనిలో పెట్టుకున్నారు. ఆ బాలిక విశాఖలో భువనేశ్వర్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది.
ప్రేమ పేరుతో ఆ బాలికను మోసం చేసిన యువకుడు ఈ నెల 18న బాలికను ప్రియుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం స్నేహితుడిని కూడా హొటల్కు పిలిచి అత్యాచారం చేయించాడు. ప్రియుడు నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడంతో మనస్తాపానికి గురవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలిక ఆర్కే బీచ్‌కు వెళ్లింది. ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్లి ఏడుస్తున్న బాధిత బాలికపై పర్యాటకుల ఫొటోలు తీసే ఓ ఫొటోగ్రాఫర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి నగరంలోని జగదాంబ కూడలికి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు.
బాధిత బాలిక లాడ్జి నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. విశాఖలో పనిచేసిన ఇంటివారు 18వ తేదీనే బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ పట్టణ స్టేషన్ పోలీసులు 22న ఆమెను గుర్తించి వాకబు చేయడంతో అసలు విషయం బయటపడజింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. నగరానికి చెందిన ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మహిళా కమిషన్ స్పందించింది. సీరియస్ అయినట్లుగా ప్రకటన జారీ చేసి.. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
విశాఖలో ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంత ఈజీగా నేరాలు జరిగిపోతున్నా.. పోలీసు వ్యవస్థ ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోతోందన్న ఆశ్చర్యవ్యక్తమవుతోంది. నిందితులకు భయం లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది.