నాని – ఓ అయిదుగురు ఆడలేడీసు.. వాళ్లకున్న రివైంజూ.. దాన్ని నాని తీర్చడం – ఇదే… `గ్యాంగ్ లీడర్` కథ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మైత్రీ మూవీస్ నిర్మిచింది. టీజర్ ఈరోజే వచ్చింది. టీజర్లో దర్శకుడు కథనిచూచాయిగా చెప్పేశాడు. ఇదో రివైంజ్ డ్రామా. రివైంజ్ స్టోరీలు రాసే పెన్సిల్ అనే రచయిత దగ్గరకు అయిదుగురు ఆడవాళ్లొస్తారు. ఈ గ్యాంగ్‌కి నాని ఎలా లీడర్ అయ్యాడో.. వాళ్లంతా ఏం చేశారన్నదే కథ. నాని సినిమా నేపథ్యం ఏదైనా… ఎంటర్టైన్మెంట్ తప్పనిసరి. ఈసారి ఆ వినోదం ఈ ఐదుగురు ఆడవాళ్లూ కలిసి అందించినట్టు అర్థమవుతోంది. విక్రమ్ కథలన్నీ గమ్మత్తుగా ఉంటాయి. రెగ్యులర్ సినిమాలు అస్సలు చేయలేడు. గ్యాంగ్ లీడర్‌లోనూ ఓ అదిరిపోయే ట్విస్టున్నట్టు అర్థం అవుతోంది. అదేంటో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాలి. ఈ చిత్రంలో కార్తికేయ (ఆర్.ఎక్స్ 100 ఫేమ్) విలన్ గా నటించాడు. తనని ఒక్క ఫ్రేమ్‌లో మాత్రమే చూపించారు. ఈ గ్యాంగ్ రివైంజ్ కూడా కార్తికేయపైనే. మరి.. ఈ రివైంజ్ డ్రామా ఎంత ఫన్నీగా సాగిందో, ఆ ఫన్ వెనుక ఉన్న కథేంటో తెలియాలంటే గ్యాంగ్ లీడర్ రావాల్సిందే.