శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మహా సముద్రం`. సిద్దార్థ్ కీలక పాత్రధారి. అజయ్ భూపతి దర్శకుడు. అతిథిరావు హైదరీ, అనూ ఇమ్మానియేల్ హీరోయిన్లు. ఓ ప్రత్యేక గీతంలో పాయల్ రాజ్ పుత్ కనిపించనుందని టాక్. ఈ చిత్రంలో జగపతిబాబుని విలన్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది. త్వరలో గోవాలో కీలకమైన షెడ్యూల్ జరుపుకోనుంది. ఇందు కోసం గోవాలో ఓ ప్రత్యేమైన సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సెట్లోనే దాదాపు 30 శాతం షూటింగ్ జరగబోతోందట. గ్యాంగ్ స్టర్ డెన్ రూపంలో ఈ సెట్ ఉంటుందని తెలుస్తోంది. జగపతిబాబు, శర్వానంద్, సిద్దార్థ్ లపై ఇక్కడే కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఆగస్టు 19న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది.