లెఫ్ట్ హ్యాండర్.. ఫ్రంట్ ఫుట్కు వస్తే ఆ బాల్ సిక్స్‌లో పడాల్సిందే..! అదీ బెంగాల్ టైగర్ బ్రాండ్. ఇప్పుడు బీసీసీఐలో సిక్సర్లు కొట్టేందుకు రెడీ అయ్యారు. కెప్టెన్ గానే భవిష్యత్ ఆటగాళ్లను తీర్చిదిద్దిన గంగూలీ ఇప్పుడు… బీసీసీఐ అధ్యక్షుడిగా.. క్రికెట్ వ్యవస్థనే మార్చేసే గేమ్‌లోకి అడుగుపెడుతున్నాడు. టాస్ కోసం స్టీవ్ వాను వెయిట్ చేయించినా.. ఫ్లింటాఫ్‌కు కౌంటర్‌గా చొక్కా విప్పి గిర గిరా తిప్పినా అదీ గంగూలీ స్టయిల్..అలా అగ్రెసివ్‌గా ప్రత్యర్థులకు ఆటతోనే కాదు..దూకుడుతోనూ సమాధానం ఇచ్చేవాడు..అందుకే గంగూలీ టీమ్ ప్రత్యేకమనిపించుకుంది. టీమిండియా కెప్టెన్గాచూపిన లీడర్షిప్ క్వాలిటీసే దాదాను ఇప్పుడు బీసీసీఐ బాస్‌ను చేస్తున్నాయడంలో అనుమానం లేదు..! బీసీసీఐ బాస్‌గా గంగూలీ అయితేనే..బోర్డు గాడిలో పడుతుందని సభ్యుల నమ్మకం..!
బీసీసీఐ ఎన్నిక 23న జరగాల్సి ఉంది..బీసీసీఐ టాప్ పోస్ట్ కోసం గంగూలీ నామినేషన్ వేసేశాడు..పోటీ లేకపోవడంతో సౌరవ్ ఎంపిక ఏకగ్రీవమేకానుంది.. నిజానికి దాదాకి బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ బృందం నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ.. ఎట్టకేలకి అందరూ గంగూలీకే మద్దతు తెలిపారు. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. బీసీసీఐ రూల్స్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబరు తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. బీసీసీఐలో రెండు పర్యాయాలు ఏ పదవులైనా చేపట్టిన తర్వాత.. సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీకి తక్కువ సమయమే ఉంటుంది..అయినా దాదా పట్టుదలతో ఉన్నాడు..
బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీకి ముందే..గంగూలీ..కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశాడు.. బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీపడుతున్నట్లు చెప్పాడు. అమిత్ షా కుమారుడు కూడా.. బీసీసీఐలోకి కీలక పదవిలోకి రాబోతున్నాడు. దాంతో కేంద్రం మద్దతు ఉంటుంది. దీంతో.. సౌరవ్.. తనకు ఉన్న పది నెలల కాలంలో.. బీసీసీఐలో సిక్సర్లు కొట్టే అవకాశం ఉంది. గంగూలీ మార్క్ మార్పులు ఏం చేస్తాడో.. చూడాలి మరి..!