ప్రభుత్వం మారాలని చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు ఎంతగా ఎదురు చూశారో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎపీలో నెలకొన్న సందడే కనిపిస్తోంది. వివిధ నియోజకవర్గాల ప్రజలు ముఖ్య కార్యకర్తలను ప్రమాణస్వీకారానికి తీసుకొచ్చారు. అయినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన గన్నవరం మొత్తం పసుపుమయం అయింది. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు.
పాసులే పాతికే వేల వరకూ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కీలక నేతలు వస్తూండటంతో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శాలమైన స్థలంలో సభా ప్రాంగంణం ఏర్పాటు చేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటలకే మొత్తం కిక్కిరిసిపోయింది. వాహనాలన్నీ పదికిలోమీటర్ల వరకూ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ముందు జాగ్రత్తగా కేసరపల్లిలోనే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు.. అదే ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసి ఉంటే మరింత గందరగోళం తయారయ్యేది.
వీఐపీ పాసులు ఉన్న వారికి కూడా… ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకోవడానికి సమస్యలు ఏర్పాడ్డాయి. చాలా మంది టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీలో చాలా రోజుల తర్వాత రాజకీయంగా ఓ ఉత్సాహభరితమైన విజయోత్సవం లాంటి కార్యక్రమం జరుగుతోంది. అంతా పసుపుమయం కావడం నయనానందకరంగా మారింది.