వైసీపీకి చెందిన యాభై మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఓటేయరని భయం పట్టుకోవడంతో.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా ఓటింగ్ కు దూరం చేయాలా అని కుట్రలు పన్నుతున్నారు వైసీపీ పెద్దలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మద్దతుగా గంటా చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు. ఎవరికీ తెలియకండా ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి రెండేళ్ల కిందట గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పట్లో రాజీనామాను ఆమోదించలేదు. అసెంబ్లీకి కూడా గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. అప్పుడు స్వయంగా స్పీకర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే స్పీకర్ పట్టించుకోలేదు. ఇప్పుడు మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా రాజీనామాను ఆమోదించేసి గెజిట్ విడుదల చేశారు. దీనికి కారణం రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటమే.
మార్చిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ వైసీపీ పరిస్థితి తేడాగా ఉండటంతో యాభై మంది టీడీపీ నిలబెట్టే అభ్యర్థికి ఓటు వేస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటు వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ నిర్ణయం తీసుకోలేదు. అాలా తసుకుంటే.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపైనా అనర్హతా వేటు వేయాల్సి ఉంటుంది. అందుకే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సమయంలో ఆ నిర్ణయం తీసేసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.