చిరంజీవి, గరికపాటి ఎపిసోడ్ ముగింపుకు వచ్చేసింది. అటు చిరంజీవి ఫ్యాన్స్, ఇటు బ్రాహ్మణ సంఘాలు రెండుగా చీలిపోయి… ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారంలో… గరికపాటిదే తప్పు అని చాలామంది బాహాటంగానే చెబుతున్నారు. జనాలకూ అదే అర్థం అవుతోంది. గరికపాటి కాస్త సంయమనం పాటిస్తే బాగుండేదన్నది అందరి ఒపీనియన్.
అందుకే ఇప్పుడు గరికపాటి కూడా తన తప్పుని తెలుసుకొన్నారని, శుక్రవారం చిరంజీవికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారని, తాను ఏ ఉద్దేశంతో అలా అనాల్సివచ్చిందో వివరణ ఇచ్చారని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి అందిన ఇన్ సైడ్ టాక్. చిరు కూడా గరికపాటికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ రోజు గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ ఉంది. ఈ సందర్భంగా చిరు `గరికపాటి` ఎపిసోడ్ కి మీడియా సాక్షిగా ఓ ముగింపు వాక్యం పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ.. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో.. గరిక పాటి టాపిక్ రాకపోతే.. ప్రత్యేకంగా ఓ వీడియో బైట్ రిలీజ్ చేసి, గరికపాటి వ్యవహాకరానికి పుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.