ఎల్బీనగర్ శివారు ప్రాంతంగా ఉన్నప్పుడు అక్కడ సీరీస్ ఫ్యాక్టరీ ఉండేది. రాను రాను ఫ్యాక్టరీ మూతపడింది. స్థలం నిరుపయోగంగా ఉండిపోయింది. ఎల్బీనగర్ హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతంగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ స్థలం వినియోగంలోకి వచ్చింది. వాసవి గ్రూప్ 30 ఎకరాల్లో భారీ నిర్మాణాలు చేపట్టింది.
ఎల్పీ నగర్ సర్కిల్ ఇప్పుడు అత్యంత బిజీయెస్ట్ ఏరియా. అక్కడ్నుంచి అతి స్వల్పదూరంలోనే మెయిన్ రోడ్డు మీద సీరీస్ ఫ్యాక్టరీ స్థలంలో ఆనంద నిలయం అనే ప్రాజెక్టును వాసవి సంస్థ చేపట్టింది. ఎల్బీనగర్ వైపు స్క్రైస్కాపర్ల నిర్మాణానికి ఇది బూమ్ ఇస్తోంది. ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని సంస్థ ప్రకటించుకుంది.
దాదాపుగా 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సుమారు 3576 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉండటంకాదు.. 72 శాతం ఓపెన్ స్పేస్ ఇస్తున్నట్లుగా సంస్థ చెబుతోంది . ఇందులో మధ్యతరగతి వారితో పాటు లగ్జరీ లివింగ్ ను ఇష్టపడేవారికి అవసరమైన డిజైన్లను నిర్మిస్తు్ననారు. వాసవి ఆనంద నిలయంలో డబుల్, ట్రిపుల్, ఫోర్ బెడ్రూములతో పాటు.. 112 స్కై విల్లాల్ని కూడా డిజైన్ చేశారు. రెండు క్లబ్ హౌజులు, స్విమ్మింగ్ పూల్స్ నుంచి మొదలు అత్యాధునిక జిమ్, ఇండోర్ అండ్ అవుట్ డోర్ గేమ్స్ జోన్ ను ఏర్పాటుచేస్తున్నారు
ఆనంద నిలయం పేరుతో ప్రారంభించిన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఖరీదు కాస్త ఎక్కువే అనిపిస్తోంది కానీ.. వారుచెబుతున్న సౌకర్యాలు పీస్ ఫుల్ లివింగ్కు అనుకూలంగా ఉంటాయి. కాస్త ఎక్కువైనా ప్రశాంతమైన జీవితం కోరుకునేవారికి ఆనంద నిలయం అలాంటి అవకాశం కల్పిస్తుంది.