ప్రజలు రాను రాను జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇళ్ల చుట్టూ రణగొణ ధ్వనులు.. ఇతర సమస్యలు ఉండకూడదనుకుంటున్నారు. అందుకే గేటెడ్ కమ్యూనిటీలు విల్లాల వైపు చూస్తున్నారు. అయితే అది ఒక్క మెట్రో నగరాల్లోనే కాదు.. టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య నగరాల్లో ఒకటి అయిన నెల్లూరులో ఇప్పుడు గేటెడ్ విల్లాలు, అపార్టుమెంట్లకు ఆదరణ పెరుగుతోంది.
నెల్లూరు సిటీ ఇప్పుడు బాగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువగా విల్లా కమ్యూనిటీలే రియల్ వ్యాపారులు నిర్మిస్తున్నారు. సిటీకి కొద్ది దూరంలో అయినా విశాలమైన విల్లాలు. పూర్తి స్థాయి భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు ఉండటం ప్లస్ పాయింట్ గా మారింది. నెల్లూరు అంటే పారిశ్రామిక వేత్తల నగరం. దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేసే దిగ్గజాల మూలాలు నెల్లూరులోనే ఉన్నాయి. అందుకే… నెల్లూరులో సహజంగానే ధనవంతులు ఎక్కువ. అలాంటి వారంతా ఇప్పుడు.. సిటీలో ఇంటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగిచుకుని గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలకు మారిపోవాలనుకుంటున్నారు. ఆ దిశగానే విల్లాల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి.
ఇక ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది అపార్టుమెంట్లు కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండాలని కోరుకుంటున్నారు. మామూలు అపార్టుమెంట్ల స్థాయిలో కొంచెం ఎక్కువ స్థలంలో మరిన్ని సౌకర్యాలతో నిర్మిస్తే .. అలాంటి చోట కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నెల్లూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందు నుంచి జోరుగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇంకా పెరిగింది. పారిశ్రమిక ప్రాంతాలకు దగ్గరగా ఉండటం.. వ్యాపార కేంద్రం కావడంతో ముందు ముందు మరింత ఎక్కువగా నెల్లూరులో రిఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. అందులో గేటెడ్ విల్లాల వాటా ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడంలో అతిశయోక్తి ఉండదు.