అమెరికా న్యాయ శాఖ అదానీపై తమ దేశంలో కేసు పెట్టింది. నిందితులుగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు మరో ఆరుగురిని పేర్కొన్నారు . న్యూయార్క్ ఈస్ట్ర్న్ డిస్ట్రిక్ కోర్టులో అక్టోబర్ 24వ తేదీన కేసు నమోదుఅయింది. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగి ంపని తేల్చారు. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్ర ఉందని సోలార్ ప్రాజెక్టులకు త్వరిత గతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చారని ఆధారాల లభించడంతో కేసు పెట్టారు.
ఇండియాలో జరిగిన అవినీతి అమెరికా కోర్టులో కేసులు పెట్టవు. కానీ ఇక్కడ అవినీతి చేసింది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టయిన కంపెనీ, కెనడా ఇన్వెస్టర్ కావడంతో కేసులు నమోదయ్యాయి. ఈ అవినీతి వల్ల కంపెనీలకు 200 కోట్ల డాలర్ల లబ్ధి చేకూరిందని గుర్తించారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అప్పటి సీఈవో వినీత్ జైన్ పై కేసు పెట్టారు. అమెరికాలో లిస్టయిన ఓసియార్ ఎనర్జీ రంజిత్ గుప్తాపై కేసు పెట్టారు. తమపై నమోదైన కేసు వివరాలను అదానీ కంపెనీ స్టాక్ మార్కెట్కు కూడా తెలిపింది.
ఈ అవినీతి మూలం ఏపీలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓసియార్ ఎనర్జీ రంజిత్ గుప్తా ఏపీలో రూ.40 వేల కోట్లతో ఓసియార్ ప్లాంట్ పెట్టాలని జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న అదాని భేటీ అయ్యారని.. భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్ల లంచం… ఏపీ ఒప్పందాల కోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఒప్పందాల్లో ఏపీ ప్రభుత్వ అధికారి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. సెకీ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. కానీ అమెరికాలో బయటపడ్డాయి. అదానీకి లింకులు కాబట్టి ఇండియాలో విచారణ చేస్తారా లేదా అన్నదానిపై అందరికీ ఓ స్పష్టత ఉంటుంది.