అదానీ వద్ద జగన్ రెడ్డి రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నారన్న విషయంపై దేశంలో ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. అదానీ లాంటి శక్తి ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ కేసు బయటపడిన అమెరికాలో మాత్రం ఇలాంటి శక్తియుక్తులు పని చేసే అవకాశం కనిపించడం లేదు. కేవలం ఎఫ్బీఐ మాత్రమే కాదు.. అంతర్జాతీయ మీడియాలు అయిన రాయిటర్స్ వంటి సంస్థలు కూడా ఈ కేసులో అసలేం జరిగిందో కూపీ లాగుతున్నాయి. వరుసగా వివరాలు బయటపెడుతున్నాయి. అటు ఎఫ్బీఐ,ఇటు అంతర్జాతీయ మీడియా సంస్థలు బయటపెడుతున్న సమాచారంతో అంతర్జాతీయంగా అదానీకి, ఇండియాలో జగన్కు సమస్యలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
రూ. 1750 కోట్ల లంచాలపై స్పష్టమైన ఆధారాలు
ఇండియాలో ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చి అధిక ధరలతో ఒప్పందాలు చేసుకుని వాటిని చూపించి భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపి అమెరికా కంపెనీ నుంచి పెట్టుబడులు రాబట్టారు అదాని. ఆ పెట్టుబడుల్ని లంచాలుగా చెల్లించారు. దీనికి సంబంధించి అదానీకి మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్లో అన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలు లభించాయి. లంచాలు ఎలా చెల్లించారో కూడా ఆధారాలు ఉన్నాయని ఎఫ్బీఐ తాజాగా కోర్టుకు తెలిపింది. బలమైన ఆధారాలు ఉన్న కేసుగా అక్కడి న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసు, అమెరికా చట్టాల ప్రకారం లంచాలు తీసుకున్నవారిపై కేసు కాదు..అలా లంచాలు ఇచ్చి తమ మార్కెట్లో మ్యానిప్యులేషన్ చేసిన వారిపై కేసు.
లంచాలు తీసుకున్నట్లుగా చెబుతున్న రాయిటర్స్
అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆ ప్రకారం అదానీ అత్యధిక లంచం ఇచ్చినట్లుగా భావిస్తున్న ఏపీలో .. జగన్ ప్రభుత్వం చేసిన ఒప్పందం పూర్వపరాలను.. సీక్రెట్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లుగా తెలిపింది. ఈ ఒప్పందానికి దాదాపుగా అన్ని శాఖలూ అభ్యంతరం చెప్పాయని.. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ముందుకెళ్లిపోయారని రాయిటర్స్ తెలిపింది. అదానీతో ఖచ్చితంగా డీల్ ఉండడానికి ఇదే సాక్ష్యాలని చెబుతున్నారు ఓ వైపు ఎస్బీఐ, మరో వైపు రాయిటర్స్ లాంటి సంస్థలు లోతుగా తవ్వి ఈ వ్యవహారాన్ని బయటకు తీస్తున్నాయి.
దాచేసినా దాగని నిజాలు !
నిజానికి ఇలాంటి కేసులో జగన్ దొరికి చంద్రబాబు తన విశ్వరూపం చూపించి ఉండాలి. కానీ జగన్ అదానీ వెనుక దాక్కున్నారు. మన దేశంలో లంచం ఇచ్చినోడి కంటే తీసుకున్నవాడే ప్రధాన నేరస్తుడు. అందుకే ఇక్కడ జగన్ కేసు కీలకంగా మారుతుంది. జగన్ లంచం తీసుకున్నాడు అని నిరూపిస్తే.. అదానీకి ఇచ్చినట్లు నిరూపణ అవుతుంది. అది అదానీ గ్రూపు సంస్థలకే నష్టం చేస్తుంది. అందుకే వీలైనంతగా తొక్కి పెడుతున్నారు. కానీ బయటపడుతున్న వాస్తవాలతో తప్పించుకోవడం అంత తేలిక కాదని.. ఎవరు తొక్కిపెట్టినా బ్లాస్ట్ అవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.