మళ్లీ రావా, జెర్సీ సినిమాలతో తన మార్క్ చూపించాడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీని హిందీలో రీమేక్ చేశాడు కానీ, ఫలితం దక్కలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే హిందీ జెర్సీకీ, విజయ్ సినిమాకీ మధ్య మరో సినిమా గప్ చుప్ గా లాగించేశాడు గౌతమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇది ముగ్గురు కుర్రాళ్ల కథ. `మ్యాడ్` తరహాలో సరదా సరదాగా సాగిపోయే స్క్రిప్టు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయ్యిందో కూడా తెలీదు. ఆ స్థాయిలో చక చక ముగిసిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు తప్ప, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. పాటలు కూడా రెడీ అయిపోయాయి. ముగ్గురు కొత్త అబ్బాయిల్ని హీరోలుగా పనిచయం చేస్తున్నారు ఈ సినిమాతో. సితార తీసిన మ్యాడ్ లో కూడా ముగ్గురు హీరోలే. కొత్త వాళ్లతో తీసిన ఆ సినిమా వర్కవుట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకీ ఓ మంచి యూత్ ఫుల్ టైటిల్ పెట్టి, మంచి సీజన్లో వదలాలని భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలోగా ఈ సినిమాని అన్నిరకాలుగా రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి.