గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గౌతమ్ నందా. రాశీఖన్నా, కేథరిన్ థెరిస్సా కథానాయికలుగా నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ కీలకమైన ఫైట్.. సింగిల్ టేక్‌లో ఓకే అయిపోయిందట. సుమారు డజను మంది రౌడీలను చిదకబాదిన ఆ ఫైట్ మూడంటే మూడే నిమిషాల్లో పూర్తి చేశారట. ఇండియన్ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోనే ఇదో రికార్డ్ అట. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా వ్యవహరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం చిత్రబృందం దాదాపుగా వారం రోజులు కష్టపడి రిహార్సల్ చేసిందట. సింగిల్ షాట్లో ఇంత పెద్ద ఫైట్ తీయడం నిజంగా విశేషమే. మరి సిల్వర్ స్ర్కీన్‌పై ఆ ఫైట్ ఎంత మాసీగా వచ్చిందో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
గోపీచంద్ సినిమాలన్నీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రాబోతున్నాయి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన చిత్రం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఈ చిత్రానికి ఆరడుగుల బుల్లెట్ అనే పేరు ఖరారు చేశారు. మరోవైపు ఆక్సిజన్ కూడా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకీ గుమ్మడికాయ్ కొట్టేస్తారు. ఈ ముడు సినిమాలూ రెండు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.