మోహన్‌బాబు సినిమా ‘గాయత్రి’ ఆడియో ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. సాధారణంగా ఆడియో ఫంక్షన్ అంటే గ్రూపు డాన్సులు, స్కిట్లతో హోరెత్తిస్తారు. వాటిని మాత్రం ‘గాయత్రి’ పక్కన పెట్టింది. అయితే… ఒకొక్కరూ స్పీచులు తెగ దంచేశారు. అందులో కొన్ని ఛమక్కులు కూడా వినిపించాయి.
* మోహన్‌బాబు పనస పండులాంటివాడు.. పైన ముళ్లు.. లోపల తీయని పసన తొనలు : తనికెళ్ల భరణి
* మోహన్ బాబు పైనాపిల్లాంటివారు.. పైన ముళ్లు.. లోపలంతా తీయగా ఉంటుంది: అనసూయ
* అనసూయ మాట్లాడుతూ మాట్లాడుతూ… మోహన్ బాబుని `బావగారూ` అనిపిలిచింది.. ఆ తరవాత దాన్ని `బాబు గారు`గా మార్చింది
* నేనుకాలేజీలో చదువుకునే రోజుల్లో శ్రియకి సైట్ కొట్టాను: మంచు విష్ణు
* ఫృద్వీగారూ… ఇంకోసారి నన్ను బ్రదర్ అంటే బాగోదూ. మీకూ నాన్నగారికీ ఐదేళ్లే తేడా: విష్ణు
* రామజోగయ్య శాస్త్రిగారూ.. ఈమధ్య మీరు సరిగా రాయడం లేదు. ఈపాట సరిగా రాయండి అని చెప్పా: విష్ఱు
* అనసూయ ఇంగ్లిష్ లో స్పీచ్ ఇస్తుంటే… `తెలుగులో మాట్లాడు` అంటూ ఆడియన్స్ గోల పెట్టారు. `తెలుగులో అయితే మనస్ఫూర్తిగా మాట్లాడలేను` అంటూ అనసూయ ఇంగ్లిషులోనే సమాధానం ఇచ్చింది.
* మోహన్ బాబుతో రెండు దెబ్బలుతింటే బాగుండును అని సెట్లో అసిసెట్లంట్లంతా పోటీ పడతారు. ఎందుకంటే.. మోహన్ బాబు కొట్టినా…ఆ తరవాత డబ్బులిచ్చి పంపిస్తాడని : బ్రహ్మానందం