కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సోలో హీరోగా వచ్చి చాలా కాలమైయింది. ఇప్పుడు మోహన్‌బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతుంది. అదే ‘గాయత్రి’. పెళ్ళయిన కొత్తయిలో వంటి సినిమాతో ఆకట్టుకున్న మదన్ ఈ చిత్రానికి దర్శకుడు మదన్. తాజాగా ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది.
రామాయణంలో రాముడికి రావణుడికి గొడవ. భారతంలో పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళూ వాళ్లూ కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది. కాని వారి మూలంగా జరిగిన యుద్దంలో అటూ ఇటూ కొన్ని లక్షలమంది చనిపోయారు. పురాణాల్లో వారు చేసింది తప్పయితే ఇక్కడ నేను చేసిందీ తప్పే. అక్కడ వాళ్లు దేవుళ్లయితే ఇక్కడ నేను దేవుడినే. అర్ధం చేసుకుంటారో అపార్ధం చేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్” అని ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ టీజర్ ని చూపించారు.
టీజర్ విషయానికి వస్తే.. మోహన్ బాబు హీరోయిజం ను హుందాగా చూపించారు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేశారు మోహన్ బాబు. ఐతే ఇందులో మాత్రం ఆయన లుక్ కొంచెం డిఫరెంట్ గా వుంది. బావుంది. ఆయన ద్విపాత్రభినయం చేస్తున్న చిత్రమిది. ఒక పాత్రలో నెగిటివ్ ఛాయలు కూడా కనిపించాయి. టీజర్ చూస్తుంటే సినిమాలో విషయం ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తంమీద ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.