పిల్లా నువ్వు లేని జీవితంతో సాయిధరమ్ తేజ్‌కి తొలి హిట్టు దక్కింది. గీతా ఆర్ట్స్నుంచి వచ్చిన సినిమా అది. ఆ తరవాత ఈ బ్యానర్లో తేజూ సినిమా చేయలేదు. ఎట్టకేలకు తేజూతో ఓ సినిమా చేయాలని గీతా ఆర్ట్స్డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం దర్శకుల కోసం వేట సాగుతోంది. దాదాపుగా వెంకీ కుడుముల పేరు ఖాయమయ్యే సూచనలు కనిపిపస్తున్నాయి ‘ఛలో’తో ఆకట్టుకున్న యువ దర్శకుడు వెంకీ. ఆ సినిమా హిట్టుతో యువ హీరోల దృష్టి వెంకీపై పడింది. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయడానికి వెంకీతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కి తేజూ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇటీవల శర్వానంద్‌కి ఓ కథ వినిపించాడు శ్రీకాంత్ అడ్డాల. శర్వా ‘నో’ అంటే.. అప్పుడు ఆ కథని తేజూతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం `తేజ్ ఐ లవ్ యూ` సినిమాతో బిజీగా ఉన్నాడు తేజూ. ఆ తరవాత.. గీతా ఆర్ట్స్ సినిమా పట్టాలెక్కుతుంది.