మెగా హీరోయిన్ నిహారిక తన సినిమా విడుదలకు ముందే అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకోగలిగింది. నిహారిక ఎంట్రీ ఎలా ఉండబోతోంది? ఆమె పెర్‌ఫార్మ్సెన్స్ రేంజ్ ఏంటి? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఒక మనసు సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే చూసేసిన నాగబాబు, వరుణ్తేజ్లైతే నిహారిక విషయంలో ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఈ సినిమాపై బన్నీ, అల్లు అరవింద్‌లు కూడా దృష్టి పెట్టి నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిహారికతో ఓ సినిమా చేయాన్నది వాళ్ల ప్లాన్.
అల్లు అర్జున్ సినిమాతోనే నిహారిక ఇంట్రడ్యూస్ అయ్యేదని.. అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. బన్నీకీ నిహారికతో ఓ సినిమా చేయాలని వుందట. ఒక మనసు సినిమాచూసి, ఒకవేళ నిహారిక పెర్ఫార్మెన్స్ నచ్చినట్టైతే.. రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారు. నిహారికకు ఇప్పటికే ఎన్ని ఆఫర్లు వచ్చినా… దేనిపై సైన్ కూడా చేయలేదట. అందుకు కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. తొలి సినిమా బయటి సంస్థలో… రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయడం మెగా హీరోల ఆనవాయితీ. దాన్ని నిహారిక విషయంలోనూ కొనసాగించాలని అరవింద్ భావిస్తున్నార్ట. సో.. బన్నీ, నిహారికల సినిమా గీతా ఆర్ట్స్‌లో రావడం దాదాపుగా ఖాయమన్నమాట.