సినిమా ప్రమోషన్లకు బిగ్ బాస్ ఓ గొప్ప వేదికలా మారిపోయింది. వారాంతం అయితే చాలు.. ఈ షోలో స్టార్ల హంగామా కనిపిస్తోంది. కొత్త సినిమాల హడావుడి బిగ్ బాస్కీ పాకేస్తోంది. ఇప్పుడు ‘గీత గోవిందం’ టీమ్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగపెడుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక, పరశురామ్లు ఈ షోలో పాల్గొని, తమ సినిమాని ప్రమోట్ చేసుకోబోతున్నారు. శని, ఆది వారాల్లో `గీత గోవిందం` ప్రమోషన్లు ఓ రేంజులో జరగబోతున్నాయి. శనివారం.. అల్లు అర్జున్ ఈ చిత్రబృందానికి ఓ భారీ పార్టీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఎలాగూ సక్సెస్ మీట్ ఉంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. ఈవారం పెద్ద సినిమాలేం లేవు. ఆగస్టు 31న `శైలజా రెడ్డి అల్లుడు` వస్తోంది. కాబట్టి ‘గీత గోవిందం’కి మరో వారం సమయం దొరికినట్టైంది. అందుకే ప్రమోషన్లను ఎక్కడా ఆపకుండా.. ఈ సినిమా రేంజుని పెంచుకుంటూ పోవాలని చిత్రబృందం డిసైడ్ అయింది. దానికి తోడు మౌత్ టాక్ కూడా విపరీతంగా స్పైడ్ అవ్వడం గీత గోవిందానికి బాగా కలిసొచ్చింది.