చిత్రసీమలో సెంటిమెంట్లపై గురెక్కువ. ఐరెన్ లెగ్గ్ అన్న మాట వినిపిస్తే చాలు.. భయపడిపోతారు. మరీ ముఖ్యంగా కథానాయికలకు ఈ ట్యాగ్‌లైన్ మరింత ఇబ్బంది పెడుతుంటుంది. కేథరిన్పైనా అలాంటి ట్యాగ్‌లైనే ఉంది. ఛమక్కు ఛల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. అది ఫ్లాప్. ఇద్దరమ్మాయిలతోలో బన్నీ పక్కన చిందేసింది కేథరిన్. ఆసినిమా కూడా తుస్సు.. ఆ తరవాత రుద్రమదేవిలో ఓ క్యారెక్టర్ లో కనిపించింది. అదీ ఫట్లు. ఎర్రబస్సులో విష్ణు పక్కన నటించింది… అది కాస్త అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు సరైనోడు పరిస్థితీ అంతే. కేథరిన్ లెగ్గు మామూలుగా లేదని, ఆమె అడుగుపెడితే.. మటాషే.. అన్న టాక్ ఇప్పటికే టాలీవుడ్లో బుసలు కొడుతోంది. ఈ సినిమాతో అది ఇంకాస్త పెరిగే ప్రమాదం ఉంది.
గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా సరైనోడుపై ప్రభావం చూపించిందనే చెప్పాలి. గీతా ఆర్ట్స్‌లో బన్నీ చేసిన సినిమాలేవీ ఆడలేదు. హ్యాపీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాతొచ్చిన బన్నీ ఓకే అనిపించింది. బద్రీనాథ్ కూడా ఆశించిన ఫలితం తీసుకురాలేదు. ఇప్పుడు సరైనోడుకీ ఇలాంటి టాకే వస్తోంది. ఇక మీదట సొంత బ్యానర్లో సినిమా చేయాలంటే బన్నీ కాస్త ఆలోచించుకోవాల్సిందే.