చిన్న సినిమాలకు ప్రచారమే పరమ ఔషదం. సినిమాలో ఏముందో, ఏం చూపించబోతున్నారో టీజర్లో చెప్పాలి. సరుకుందని తెలిస్తే… టీజర్ నుంచే బిజినెస్ మొదలవుతుంది. కనీసం మార్కెట్లో్ నిలబడడానికి ఓ చోటంటూ టీజర్ చూపిస్తుంది. కథలో దమ్ముందని తెలిస్తే బిజినెస్ మొదలవుతుంది. ఎలాంటి అలికిడీ లేకుండా వచ్చినా, టీజర్‌తో వ్యాపారం చేసుకునే సినిమాలు చాలా ఉన్నాయి. అందులో జార్జ్‌రెడ్డి ఒకటి. అసలు ఇలాంటి సినిమా ఒకటి తయారవుతుందనే జనాలకు తెలీదు. అలాంటిది టీజర్ వచ్చాక – ఈ సినిమాపై ఫో్కస్ పడింది. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా థియేటరికల్ రైట్స్‌కి రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.
జార్జిరెడ్డి ఓ విద్యార్థి నాయకుడు. గోల్డ్ మెడల్ సాధించిన మెరిట్ విద్యార్థి… ఆ తరవాత విద్యార్థి పోరాటాల్లో పాల్గొని, యువతని ఉత్తేజితుల్ని చేసి. ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులు ఇప్పటికీ జార్జ్‌రెడ్డి జీవితాన్ని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఈ కథే సినిమాగా రూపుదిద్దుకుంటోంది. రాంగోపాల్ వర్మ స్కూలు నుంచి వచ్చిన శాండీ జార్జ్‌రెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. సత్య ఓ కీలక పాత్ర పోషించాడు. టీజర్లో ఇంటెన్సిటీ కనిపించింది. కచ్చితంగా యువతరాన్ని షేక్ చేయగల విషయం ఏదో ఉందనిపించింది. యూత్ టార్గెట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి గానీ, యువతని ప్రేరేపించి, వాళ్లలో ఉద్వేగాన్ని పెంచే సినిమాలు రావడం లేదు. కాలేజీ ఉద్యమాలు, అక్కడి జీవితాలు, విద్యార్థి నాయకత్వం.. ఇవేం ఈనాటి సినిమాల్లో కనిపించడం లేదు. ఓ రకంగా.. యూత్‌కి కొత్త కలర్లో కనిపించే సినిమా ఇది. అందుకే.. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాపై 5 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఓ చిన్న సినిమాకి ఈ స్థాయిలో థియేటరికల్ రైట్స్ రావడం గొప్ప విషయమే. కాకపోతే ఇప్పటి వరకూ ఈసినిమాపై రూ.10 కోట్లకు పైగానే ఖర్చు పెట్టామని నిర్మాతలు చెబుతున్నారు. అదే నిజమైతే మిగిలినవి శాటిలైట్ హక్కుల రూపంలో రాబట్టుకోవాల్సి ఉంటుంది.