మీ పిల్లలే ఇంగ్లిష్ మీడియాంలో చదవాలా పేద పిల్లలు వద్దా అని… సెంటిమెంట్ డైలాగులతో పేద పిల్లల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేస్తూ… అవినీతికి పాల్పడుతూ… బైజూర్, ఐబీ, సీబీఎస్ఈ అంటూ నాటకాలాడుతున్న ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఈ సారి జపనీస్, జర్మన్ భాషల గురించి గుర్తుకు వచ్చింది. త్వరలో ఏపీ ప్రభుత్వ బ డుల్లో జర్మన్, జపనీస్ నేర్పుతారట. సమీక్షలో సీఎం జగన్ ఇదే చెప్పారు.
ఆషామాషీగా సీఎం జగన్ ఇది చెప్పరని గత పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికీ తెలియని ఐబీ కరికులం తెస్తామని ఇలా సమీక్షలు చెప్పి.. రెండు నెలల్లో ఒప్పందం చేసుకున్నారు. అసలు ఈ ఐబీ ఎందీ.. మనకు పనికొస్తుందా అన్నది పట్టించుకోలేదు. దీని వెనుక పెద్ద స్కాం ఉందని జనసేన బయటపెట్టింది. టోఫెల్ విషయంలోనూ అంతే. అసలు టోఫెల్ ఎంత మందికి అవసరం అన్నది చెప్పలేదు. టోఫెల్ అంటే ఇంగ్లిష్ పరీక్ష మాత్రమేనన్నట్లుగా ఒప్పందం చేసుకుని సింగపూర్ సంస్థకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.
ఇక బైజూస్ ట్యాబ్స్… సీబీఎస్ఈ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జపనీస్, జర్మన్ కూడా నేర్పేందుకు ఏదో ఓ కంపెనీతో మాట్లాడుకునే ఉంటారని… అన్ని లెక్కలు పూర్తయినందునే ఇప్పుడు సమీక్షలో జగన్ ఆ మాట అన్నారని.. త్వరలో ఒప్పందాలు జరిగిపోవడం.. .. డబ్బులు చెల్లించేయడం వంటివి కూడా ఉంటాయని అనుమానిస్తున్నారు.