ఆర్.ఆర్.ఆర్ కి అన్నీ అలా అలా కలిసొచ్చేస్తున్నాయి. వసూళ్లు తగ్గుతున్నాయనుకున్నప్పుడు పండగలొచ్చి ప్లస్ అయిపోతున్నాయి. ఉగాది పండగ కి ఆర్.ఆర్.ఆర్ బాగా క్యాష్ చేసుకొంది. దానికి తోడు బాక్సాఫీసు ముందుకొస్తున్న సినిమాలేవీ పెద్ద ప్రభావం చూపించకపోవడం మరింత కలిసొస్తోంది. గత వారం విడుదలైన `మిషన్ ఇంపాజిబుల్` ఫ్లాప్ అయ్యింది. దాంతో సినీ ప్రియులకు `ఆర్.ఆర్.ఆర్` తప్ప మరో ఆప్షన్ దొరకలేదు. ఈవారం కూడా అదే జరిగింది. శుక్రవారం విడుదలైన `గని`కి ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో సినిమాకి వెళ్దామనుకున్న వాళ్లంతా `ఆర్.ఆర్.ఆర్` వైపే చూస్తున్నారు. రిపీటెడ్ ఆడియన్స్ `ఆర్.ఆర్.ఆర్`కి ఎక్కువవుతున్నారు. `గని` బాగుంటే ఈ వీకెండ్ ఆర్.ఆర్.ఆర్ హవా తగ్గేది. ఇప్పుడు ఆ ప్రమాదం లేకుండా పోయింది. వచ్చేవారం రెండు సినిమాలొస్తున్నాయి. అవి రెండూ డబ్బింగ్ బొమ్మలే. బీస్ట్, కేజీఎఫ్లు 13, 14 తేదీల్లో విడుదల అవుతున్నాయి. ఈ సినిమాలపై మంచి హైప్ ఉంది. కాబట్టి.. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఫలితాల్లో ఏమాత్రం తేడా ఉన్నా… ఆర్.ఆర్.ఆర్ ఖాతాలో మరో వీకెండ్ పడిపోయినట్టే..!