వరుణ్ తేజ్ ‘గని’ సినిమా బడ్జెట్ రూ.50 కోట్లయ్యింది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా, జగపతి బాబు.. ఇలా భారీ తారాగణంతో పాటు కరోనా కారణంగా షూటింగులు వాయిదా పడటం, రీషూట్లు ఇవన్నీ కలుపుకొని యాబై కోట్ల మార్క్ తాకింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. ఈ చచిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఆయనకి ఇదే మొదటి సినిమా. కొత్త దర్శకుడిపై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టడం మామూలు విషయం కాదు.
అయితే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ కూడా భారీ లెవల్ జరిగింది. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయని చెబుతున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఇదే హయ్యెస్ట్ శాటిలైట్ రేటు. ఓటిటి, శాటిలైట్ రూపంలో 25 కోట్లు రావడంతో నిర్మాతలకు టెన్షన్ తగ్గింది. నిజానికి వరుణ్ తేజ్ సినిమా యాబై కోట్లు చేయాలంటే ‘ఫిదా’ రేంజ్ లో హిట్ అవ్వాలి. కొంచెం తేడా చేసిన నిర్మాతలు నష్టాలు చూసే అవకాశం వుంది. అయితే ఇప్పుడు ఓటిటి, శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 25 కోట్లు రావడంతో విడుదలకు ముందే ‘గని’ టీం రిలాక్స్ అయ్యిందని చెప్పాలి. అన్నట్టు ఈ సినిమాకి సెన్సార్ కూడా జరిగింది. ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఏప్రిల్ 8న సినిమా ప్రేక్షకులముందుకు వస్తుంది.