ఎన్నాళ్ళగానో రాజకీయ పార్టీలన్నీ ఎదురుచూస్తున్న జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ అవుతుంది. వచ్చే నెల 2వ తేదీన పోలింగ్ నిర్వహించి, 5వ తేదీన ఫలితాలు వెలువరిస్తారు. జి.హెచ్.ఎం.సి.పరిధిలో 150 డివిజన్ల వారిగా రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. నేటి నుంచి హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది.
ఎన్నికల నోటిఫికేషన్: జనవరి: 12న; నామినేషన్ల స్వీకరణ: జనవరి 12 నుండి 17వరకు; నామినేషన్ల పరిశీలన: జనవరి 18; నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 21 వరకు; పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 2; ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 5వ తేదీ.
జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఉన్న 150 డివిజన్లలో వివిధ కులాలకు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను కేటాయిస్తూ తెలంగాణా ప్రభుత్వం జి.ఓ. నెంబర్ 25 శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 150 డివిజన్లలో 44 డివిజన్లను, మరో 44 డివిజన్లను మహిళల అన్ రిజర్వుడ్ కోసం కేటాయించింది. బిసి మహిళలకి: 25; బిసి జనరల్: 25; ఎస్సీ జనరల్: 4; ఎస్సీ ఉమెన్: 5; ఎస్టీ జనరల్: 1; ఎస్టీ మహిళలకి: 1 స్థానం కేటాయించింది.
అన్-రిజర్వుడ్ డివిజన్లు: మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తీనాపురం, చంపాపేట్, లింగోజీగూడ, కొత్తపేట, చైతన్యపూరి, గడ్డి అన్నారం, అక్బర్ బాగ్, డబీర్ పుర, రెయిన్ బజార్, పత్తర్ ఘట్టి, లలిత్ బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగంపేట్, బేగంబజార్, మైలార్ దేవ్ పల్లి, జాంబాగ్, రామ్ నగర్, బంజారాహిల్స్, షేక్ పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, వెంగళరావునగర్, రహమత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కేపిహెచ్ బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి.
మహిళల కోసం కేటాయించిన అన్ రిజర్వుడ్ డివిజన్లు: ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్ నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారంబాగ్, ఆజాంపుర, ఐఎస్ సదన్, లంగర్ హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్, కాచీగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అడిక్ మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడ, అమీర్ పేట, సనత్ నగర్, హఫీజ్ పేట, చందానగర్, భారతీనగర్, బాలజీనగర్, అల్లాపూర్, వివేకానందనగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్ మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, గౌతంనగర్, తార్కాక, సీతాఫల్ మండీ, బేగంపేట, మోండామార్కెట్.
బీసీ (జనరల్) : చర్లపల్లి, సిక్ చావనీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహామల్, పురానాపూల్, దూద్ బౌలి,జహనుమా, రాంనాస్ పూరా, కిషన్ బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్ నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్ పేట, బోలక్ పూర్, బోరబండ, రాంచంద్రాపురం, పటాన్ చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్.
బీసీ (మహిళలు): రామంతాపూర్, పాత మలక్ పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కూర్మగూడ, కంచన్ బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమన్ నగర్, అత్తాపూర్, మంగళ్ హట్, గోల్కొండ, టోలీచౌకీ,ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.
ఎస్టీ(జనరల్): ఫలక్ నుమా; ఎస్టీ(మహిళ): హస్తినాపురం; ఎస్సీ(జనరల్):కాప్రా, మీర్ పేట హెచ్.బి.కాలనీ, జయాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.
ఎస్సీ(మహిళలు): రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట.