రాష్ట్రంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండ్రోజులుగా జీహెచ్ఎంసీలో భారీ వర్షాలు పడుతుండగా, సాయంత్రం వరకు మరోసారి కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే జీహెచ్ఎంసీలో స్కూల్స్ కు సెలవులు ప్రకటించగా… జలమండలిలో సెలవులు రద్దు చేసి, అందరూ తమ విధులకు హజరు కావాలని ఎంపీ అశోక్ రెడ్డి సూచించారు.
అయితే, ఈ భారీ వర్షానికి ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో… ఎవరికీ తెలియదు. కాబట్టి, స్థానికంగా ఉన్న ప్రజలు నిలిచి ఉన్న నీరును పంపేందుకు మ్యాన్ హోల్స్ తెరుస్తారని, దయచేసి అలా తెరవకూడదని జలమండలి ఎంపీ హెచ్చరించారు. మీరు మ్యాన్ హోల్ తెరిచిన విషయం తెలియక… ఆ వరద నీటిలో కనపడక అందులో పడిపోయే ప్రమాదం ఉంటుందని, ఎక్కడైనా నీరు నిలిస్తే జలమండలి లేదా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకరావాలని కోరారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు… ఓపెన్ నాలాల విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు చేపట్టాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని… కలుషిత నీరు వస్తే, ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జలమండలి సూచించింది.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది పని ప్రారంభించారని, శానిటేషన్ డ్రైవ్ కూడా చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.