హైదరాబాద్: మొన్న హైదరాబాద్ నగరంలో ముజ్రా పార్టీలో పట్టుబడినవారిలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఎనిమిది మంది కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు పడింది. జహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇనస్పెక్టర్లు ఉన్నారు. వీరు శనివారం రాత్రి నగర శివార్లలోని ఖానామెట్‌లో ఓ ప్రైవేట్ భవనంలో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు దాడిచేసి పదమంది పురుషులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.