కేసీఆర్ విసిరిన ముందస్తు బాణం కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే గుచ్చుకుంది. అయినా సరే పోరాటానికి సిద్ధపడింది. త్యాగాలకు సిద్ధపడి మహాకూటమికి ఓకే అన్నది. కర్నూలు నుంచి వెళ్తూ రాహుల్ గాంధీ… హైదరాబాద్ విమానాశ్రయంలో.. గంటన్నర పాటు…కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంపై.. రాహుల్ చెప్పింది విన్నారు. ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ నియామకంపై చర్చించారు. ఫీల్డ్‌లో ఏ మాత్రం వెనుకబడకుండా.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై… అవసరమైతే తుదికంటా న్యాయపోరాటం చేయాలని సూచించారు. రాహుల్… విమానాశ్రయంలో దిశానిర్దేశం అయిన కొద్ది గంటల్లోనే.. ట్రబుల్ షూటర్‌గా పేరున్న గులాం నబీ ఆజాద్‌ను… రంగంలోకి దింపుతున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా పని చేసిన అనుభవం… ఆజాద్‌కు ఉంది. అందుకే.. ముందస్తు గందరగోళాన్ని చక్కదిద్దడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీ అధినతే రంగంలోకి దింపుతున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికలో వ్యూహాత్మకంగా వ్యవహరించి… బీజేపీని అధికారానికి దూరం చేశారు. ఈసారి ఆజాద్ తెలంగాణలో కీలకం కాబోతున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి మహాకూటమి వ్యవహారాన్ని ఆజాద్ క్లియర్ చేసే అవకాశం ఉంది. అసలు ఆజాద్ వస్తున్న కారణం.. మహాకూటమికి ఓ రూపు తేవడానికేనని చెబుతున్నారు.
గులాంనబీ ఆజాద్.. మహాకూటమిలో పార్టీలోత సీట్ల సద్దుబాటును ఖరారు చేసి.. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్నదాన్ని కూడా.. ఖరారు చేసే అవకాశం ఉంది. పూర్తి నివేదికతో ఆయన ఢిల్లీకి వెళ్తారు. అభ్యర్థుల ఎంపికపైనా.. ఆజాద్ కసరత్తు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి… ఇప్పటి వరకూ కాస్తంత స్తబ్దుగా ఉన్న… తెలంగాణ కాంగ్రెస్‌కు.. బూస్టప్ ఇవ్వడానికి ఆజాద్ రంగంలోకి దిగుతున్నారు. గతంలోలా ఈయన వ్యూహారాలు సక్సెస్ అవుతాయో.. కేసీఆర్ దెబ్బకు చిత్తవుతాయో చూడాలి..!