అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను.. రెండు వందల పేజీల నివేదిక రూపంలో.. జీఎన్‌రావు కమిటీ… జగన్‌కే అందించింది. విశాఖలో సచివాలయం, సీఎం క్యార్యాలయం వేసవి అసెంబ్లీ ఉండాలని.. తుళ్లూరులో.. అసెంబ్లీ భవనం ఉండాలని… కర్నూలులో హైకోర్టు పెట్టాలని.. జీఎన్ రావు కమిటీ సూచించింది. వరద ముంపు లేని ప్రాంతంలో… రాజధాని పెట్టాలని సూచించినట్లుగా… ప్రొఫెసర్ జీఎన్ రావు మీడియాకు తెలిపారు. 13 జిల్లాలో పరిస్థితులను అధ్యయనం చేసి సమగ్రాభివృద్ధికి సిఫారసులు చేశామని… ప్రతి జిల్లాలోనూ పర్యటించి జనం ఆంకాక్షలు, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమని.. కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి చేయాలన్నారు. దక్షిణ కోస్తా, సీమ ప్రాంతాల వైపు పట్టణీకరణ తక్కువగా ఉందని.. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఏపీకి తప్పనిసరని సూచించామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా కమిటీ విభజించింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ ఒక మండలిగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలను రెండో మండలిగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను మూడో మండలిగా సీమ నాలుగు జిల్లాలను నాలుగో మండలిగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. అసెంబ్లీ, గవర్నర్ భవనం అమరావతిలోనే ఉంటాయని.. శ్రీబాగ్ ఒడంబడికలో చెప్పినట్టు హైకోర్టు కర్నూలులో ఉండాలని సూచించామన్నారు.
అమరావతి, విశాఖల్లో హైకోర్టు బెంచ్‌లు పెట్టాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి విధానాలు రూపొదించాలని సిఫార్సు చేశారు. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడామని.. 35 వేల సిఫారసులు వచ్చాయన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగితే ప్రజాసమస్యల పరిష్కారానికి వీలుగా ఉంటుంది..ప్రతి దానికి రాజధానికి రావాల్సిన అవసరం ఉండదని కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర, శ్రీనగర్‌లో ఉన్నట్టుగా విశాఖ, అమరావతి నుంచి లెజిస్లేచర్ వ్యవస్థ పనిచేయొచ్చని సిఫార్సు చేసినట్లుగా… జీఎన్ రావు కమిటీ తెలిపింది.