తెలంగాణలో ఉద్యోగార్థులు గ్రూప్ 1 గురించి చర్చించుకుటున్నారు. జీవో 29 ఉపసంహరణే టార్గెట్ గా ఉద్యమం జరుగుతోంది. అయితే అసలు ఈ జీవోలో ఏముందో 90 శాతం మందికి తెలియదు. దాని వల్ల ఎవరికి మేలు.. ఎవరికి నష్టం అన్నది కూడా ఎవరికీ తెలియదు. బీఆర్ఎస్ తెచ్చిన జీవో 55 స్థానంలో జీవో 29 తెచ్చారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ జీవోలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక్క ఉద్యోగానికి 50 మంది రేషియోలో మెయిన్స్‌కు ఎంపిక చేసేందుకు జీవో 55
ఇప్పుడు మెయిన్స్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 నోటిపికేషన్ రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది కాదు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిందే. దానిపై జరిగిన లొల్లి అంతా ఇంతా కాదు. అంతా రద్దులు వాయిదాల తరవాత ప్రిలిమ్స్ నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ హయాంలోనే ఒక్క జాబ్‌కి యాభై మంది రేషియోలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల్ని నిర్ణయించేలా కటాఫ్ పెట్టాలని జీవో 55 ఇచ్చారు. ఆ
జీవో 29 ప్రకారం మెయిన్స్ కు మరో 3,232
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవో 55 విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. రిజర్వుడు పోస్టులకు 50 రేషియోలో అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. అలా తగ్గిన అభ్యర్థుల స్థానంలో మెరిట్ లిస్టు నుంచి మెయిన్స్ రాసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తెచ్చింది. పోస్టులు భ ర్తీ కాకపోతే బ్యాక్ లాగ్‌కు పోతాయి. అలా పోకుండా ఉండేందుకు మెరిట్ సాధించిన వారిని ఈ జాబితాలోకి తెచ్చారు. వారేమీ అగ్రకులాల వారు కాదని.. రిజర్వుడు, వికలాంగులు అయినా మెరిట్ కారణంగా జనరల్ కోటాలోకి వెళ్లిన వాళ్లేననిప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అపోహలే ఎక్కువ
మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 28,150 మంది అభ్యర్థులు 55 జీవో ప్రకారం మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. రిజర్వుడు, వికలాంగుల కోటాలో 1/50 నిష్పత్తి కన్న తక్కువ మంది అభ్యర్థులున్న చోట మెరిట్ జాబితా నుంచి అవకాశం కల్పించారు. దీని కోసం జీవో 29 జారీ చేశారు. ఇప్పుడు 31,382 మంది అభ్యర్థులు అయ్యారు. అదనంగా వచ్చిన 3,232 మంది అగ్రవర్ణాల వారనేది రిజర్వుడు కులాల అభ్యర్థుల వాదన. కానీ కాదని ప్రభుత్వం అంటోంది. వికలాంగులు, రిజర్వుడు కులాల ఉద్యోగాలు ఇతర కులాలకు ఇచ్చే అవకాశం ఎలా ఉంటుందన్నప్రశ్నలు వస్తున్నాయి.
పదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగలేదు. ఇప్పుడైనా జరుగుతున్న వాటిని ఇలాంటి వివాదాలతో అపోహలతో వదులుకోకుండా పరీక్ష రాయాలని .. పొలిటికల్ ట్రాప్‌లో పడవద్దని ఎక్కువ మంది సూచిస్తున్నారు.