చిరంజీవి `గాడ్ ఫాదర్` రిలీజ్ కి రెడీ అయ్యింది. దసరా సందర్భంగా అక్టోబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రమోషన్లకు శ్రీకారం చుట్టాలని చిత్రబృందం భావిస్తోంది. మరోవైపు ఓ ఐటెమ్ ఇంకా తెరకెక్కించాల్సివుంది. గాడ్ ఫాదర్ సినిమా అంతా పూర్తయినా.. ఐటెమ్ పాట బాకీ పడిపోయింది. ఇప్పుడు ఈ పాటని ముంబైలో షూట్ చేయబోతున్నారు. శుక్రవారం నుంచి ముంబైలో ఈ పాటని తెరకెక్కిస్తారు. ఐటెమ్ గాళ్‌గా `బింబిసార` ఫేమ్ వారినా హుస్సేన్ ఈ పాటకు చిందులు వేయబోతోందని టాక్. ఇది విలన్ డెన్‌లో జరిగే పాట. అందుకే చిరు ఈ పాటలో కనిపించడు. కేవలం ఇంటర్ కట్స్ లో మాత్రమే చిరుని చూపిస్తారు. గాడ్ ఫాదర్ చిత్రానికి నీరవ్ షా కెమెరామెన్. అయితే ఈ ఐటెమ్ పాటకు మాత్రం ఛోటా కె.నాయుడు కెమెరామెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ వారంలోనే గాడ్ ఫాదర్ ట్రైలర్ రాబోతోంది. దాంతో పాటు మూడు పాటల్ని వరుసగా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.