ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. అందుకోసం చిరు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి బర్త్ డే గిఫ్టులు ఓ రేంజ్లో ఉండబోతున్నాయి. చిరు నటిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ శర వేగంగా షూటింగ్ జరుపుకొంటున్నాయి. ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. వీటికి సంబంధించిన లుక్కులూ, టీజర్లూ… చిరు పుట్టిన రోజునే వస్తున్నాయి.
21న ‘గాడ్ ఫాదర్’ టీజర్ వస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ లుక్ ని 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు మాస్ అవతార్‌లో దర్శనమివ్వబోతున్నాడని, ఫస్ట్ లుక్‌తోనే ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయాలన్నంత కసితో ఈ లుక్ ని డిజైన్ చేశారని టాక్. ఈ సినిమా టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని జనం అనుకోవడమే తప్ప… చిత్రబృందం అధికారికంగా ఫిక్స్ చేయలేదు. పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ కూడా కూడా అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఇక `భోళా శంకర్`కి సంబంధించి ఓ పాట గానీ, చిన్న టీజర్ గానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చిరు బర్త్ డేకి.. మూడు గిఫ్టులు గ్యారెంటీ అన్నమాట. ఇక చిరు కొత్త సినిమా సంగతులేమైనా ఆ రోజు బయటకు వస్తాయేమో చూడాలి.