మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ రూపొందిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఈ రోజు అనంతపురంలో జరుగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఫాదర్ ట్రైలర్ ని విడుదల చేశారు.
”మన స్టేట్ సిఎం పికెఆర్ ఆకస్మిక మరణం. మంచోళ్ళంతా మంచోళ్ళు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక. అన్ని రంగులు మారుతాయి. నెక్స్ట్ సిఎం సీట్లో కూర్చోవడానికి ఆల్ పాజిబులిటీస్ వున్న వ్యక్తి.. ” అంటూ పూరి జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైయింది.
”నేను రాజకీయాలకు దూరంగా వున్నాను. కానీ నా నుండి రాజకీయాలు దూరం కాలేదు” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ‘నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెదపట్టనివ్వను” అనే డైలాగ్ కూడా పేలింది. దాదాపు లూసిఫర్ కథనే తీసుకున్నారు, అయితే ఈ కథకు కావాల్సినంత యాక్షన్ మసాలా దట్టించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
యాక్షన్ సీన్స్ అన్నీ చాలా ఇంటెన్స్ గా డిజైన్ చేశారు. ట్రైలర్ డైలాగ్స్, యాక్షన్ తో నిండిపోయింది. ట్రైలర్ సెకండ్ హాఫ్ లో సల్మాన్ ఖాన్ ప్రజన్స్ హైలెట్ గా నిలిచింది. గన్ ఫైరింగ్ సీక్వెన్స్ అలరించింది. అలాగే కీలక పాత్రలైన సత్యదేవ్, నయనతారల ప్రజన్స్ కూడా ఆకట్టుకుంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు భారీగా కనిపించాయి. మొత్తానికి రెండు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ గాడ్ ఫాదర్ పై క్యూరియాసిటీని పెంచింది.