గోదావరిని శ్రీశైలానికి మళ్లించడానికి… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ.. ఓ అంగీకారానికి వచ్చాయి. నీటిని తరలించే ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపాయి. గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా తరలించాలో.. ఓ నివేదిక రెడీ చేయబోతున్నారు. బయటకు చెప్పకపోయినప్పటికీ.. ఈ నివేదికలో.. ఖర్చుల వివరాలు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం ఎంతవుతుందనే చర్చ కూడా ఉంటుంది.
కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషనే నివేదిక..!
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో… కృష్ణా, గోదావరి నదుల్లో నాలుగు వేల టీఎంసీల నీటిలభ్యత ఉందని చెప్పారు. వాటిని ఎక్కడెక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలన్నదానిపైనా వివరించారు. పోలవరం నుంచి ప్రధానంగా నీటి తరలింపు ఉంటుంది. ఆ దిశగానే అధికారులు.. నివేదిక సిద్ధం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రాజెక్టులను రీడిజైన్ చేసిన… కేసీఆర్… కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు.. అదే తరహాలో.. శ్రీశైలానికి గోదావరి నీరు తరలింపు వ్యూహం సిద్ధమవుతోంది.
అయ్యే ఖర్చులో ఏపీ వాటా 58 శాతమా..?
ఇలా నీటి తరలింపు ప్రాజెక్టు.. మరో కాళేశ్వరం లాంటిదేనన్న అభిప్రాయం.. నీటిపారుదల రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఎత్తిపోతల పైనే ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి… భారీగా ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇప్పుడు న్న పరిస్థితుల్లో కనీసం రూ. లక్ష కోట్ల అంచనా వ్యయం ఉండవచ్చని.. అయితే.. రెండు రాష్ట్రాలు పంచుకుంటాయి కాబట్టి.. జనాభా ప్రాతిపదికన లేదా… సాగునీరు ప్రయోజనం పొందే ఎకరాల ఆధారంగా.. ఖర్చులు భరించే ప్రతిపాదన తీసుకు రావొచ్చంటున్నారు. ఎలా చూసినా.. ఆంధ్రప్రదేశ్‌పై… కనీసం రూ. 50 వేల కోట్ల భారం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దిగువ రాష్ట్ర ప్రయోజనాలు ఎగువ రాష్ట్రం దయమీద ఉండాల్సిందేనా..?
ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకెళ్తే.. ఎన్నో సందేహాలు ప్రజల్లో వస్తాయి. ఎప్పుడైనా ఎగువ రాష్ట్రానికి ఉండే అడ్వాంటేజ్ ఎగువ రాష్ట్రానికి ఉంటుంది. ఎందుకంటే.. పై నుంచి వచ్చే నీళ్లను.. ఎలా అయినా ఆపుకోవడానికి కావాల్సినన్ని ప్రయత్నాలు చేస్తుంది. దిగువ రాష్ట్రం మాత్రం.. తమ వాటాగా.. నికరజలాలను పొందే హక్కు ఉంటుంది. ఆ నికరజలాలపై హక్కులను.. ఈ కొత్త ప్రణాళిక ద్వారా ఏపీ కోల్పోబోతోందన్న ప్రచారం జరుగుతుంది. దీనికి అనేక రకాల విశ్లేషణలు.. సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా మొదటగా ప్రయోజనం పొందేది.. తెలంగాణనే. ముందుగా నల్లగొండ అవసరాలు తీర్చుకుంటారు. ఆ తర్వాత పాలమూరు పొలాల్లో నీళ్లు పారిస్తారు. మరి ఆ తర్వాత కూడా..శ్రీశైలం నుంచి రాయలసీమకు పంపడానికి నీళ్లు లభ్యమవుతాయా..? అవ్వకపోతే పరిస్థితేమిటన్నది… చర్చనీయాంశం. ఎందుకంటే.. ఇప్పుడు వరకూ ఏ ప్రాజెక్టులోనూ సమృద్ధిగా నీరు లభించడం లేదు.
గత సర్కార్ ప్రణాళికలన్నీ బుట్ట దాఖలే..!
గత ప్రభుత్వం పట్టిసీమ నుంచి నీటిని కృష్ణాకు తీసుకొచ్చి ఫలితం చూపించింది. ఆ ఉత్సాహంతో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల మహాసంగమం సాకారం చేయాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. నాగార్జునసాగర్ కుడిఆయకట్టుకు తీసుకెళ్లేందుకు గత ఏడాది గోదావరి – పెన్నా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణం కలిపి రూ.6,020.15 కోట్ల అంచనా విలువతో ఈ పనిని చేపట్టింది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి కావాలని అప్పటి సీఎం చంద్రబాబునా యుడు అధికారులకు నిర్దేశించారు. 5 లక్షల 12 వేల 150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే ప్రాజెక్టు ఇది. పెన్నా నుంచి రాయలసీమకు నీటిని తరలించేందుకు వివిధ ప్రాజెక్టులు.. ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో…ఆ ప్రాజెక్టులన్నింటినీ నిలిపి వేసి.. తెలంగాణ భాగస్వామ్యంతో.. కొత్తగా ప్రాజెక్టుల రీడిజైన్ చేయడం.. కాస్త ఆశ్చర్యకరమే.