అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో అతి పెద్ద భారతీయ రెస్టారెంట్ చెయిన్ “గోదావరి” ఈ వారాంతంలో జూన్ 28, 2019న నేపర్విల్, ఇలినాయిస్ (షికాగో)లో తన ప్రతిష్టాత్మక కేంద్రాన్ని ప్రారంభించనుంది. షాంబర్గ్, ఇలినాయిస్‌లో తన స్టోర్‌ను విజయవంతంగా ప్రారంభించిన అనంతరం షికాగో సబర్బ్ లో ఇది సంస్థకు రెండో లొకేషన్.
ఈ విశిష్ట కేంద్రం కొత్తగా నిర్మించిన పటేల్ బ్రదర్స్ ప్లాజాలో విశాల ప్రాంగణంలో 180 సీట్ల బాక్వెంట్ సదుపాయం మరియు ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో గోదావరి బ్రాండ్ యొక్క ప్రత్యేకతను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లే రీతిలో తీర్చదిద్దబడింది.
200 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నోరూరించే లంచ్ బఫెట్లతో పాటుగా “ఉలవచారు ఇడ్లీ”, “దొండకాయ మాంసం”, “తాగుబోతు కోడి వేపుడు”, “పైనాపిల్ రసం” సహా మరెన్నో రుచులు మరియు భారీ మెనూతో కూడిన డిన్నర్ స్పెషల్స్ అందుబాటులో ఉన్నాయి.
“గోదావరి” ప్రస్తుతం భాగస్వామ్యం పంచుకున్న “పటేల్ బ్రదర్స్” దేశవ్యాప్తంగా తమకున్న సొంత ప్లాజాలలో విస్తరిస్తూ పెద్ద ఎత్తున దేశృ ట్రాఫిక్‌ను తనవైపు ఆకర్షిస్తోంది. దీంతో పాటుగా, గోదావరి తన ఆకర్షణీయ కేంద్రాలను జెర్సీ సిటీ (న్యూజెర్సీ), ఫిలడెల్ఫియా (మాల్వెర్న్), లండన్ (యూకే), చైనా మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తరిస్తోంది.
“షాంబర్గ్ లో మా మొట్టమొదటి కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి భారతదేశానికి చెందిన అత్యంత విజయవంతంగా ముందుకు సాగుతున్న రెస్టారెంట్లలో మేం ఒకటిగా నిలుస్తున్నాం (Indian restaurants in Chicago). ఈ కీలకమైన ప్రాంతంలో ఆకర్షణీయమైన బాంక్వెట్ మరియు డెకరేటివ్లతో మా నూతన కేంద్రాన్ని ప్రారంభించుకోవడం పట్ల మేమెంతో ఉత్కంఠగా మరియు సంతోషంగా ఉన్నాం” అని గోదావరి చికాగోకు చెందిన లవ్‌కుశ్ రెడ్డి మరియు వరుణ్ మేడిశెట్టి వివరించారు.
“గోదావరికి చెందిన యువ బృందం అద్భుతమైన పనితీరుతో మా నూతన కేంద్రాన్ని స్వల్పకాల వ్యవధిలోనే ప్రారంభించుకోవడం సాధ్యమైంది. పెద్ద ఎత్తున అతిథుల ఆదరణ మాకు దక్కుతున్న నేపథ్యంలో ప్రతి అంశంలో మాకు వారు మార్గదర్శకం వహిస్తున్నారు” అని గతవారంలో ప్రారంభమైన గోదావరి సిన్సినాటికి చెందిన కళ్యాణ్ అడప తమ ఆనందాన్ని పంచుకున్నారు.
“ఈ విశ్వంలో ప్రతిష్టాత్మక భారతీయ రెస్టారెంట్ చైన్లలో ఒకటిగా నిలిచేందుకు మేం ప్రతిరోజూ కృషి చేస్తున్నాం మరియు ఉత్తమమైన భారీగా వృద్ధి చెందుతున్నాం. భారతీయ ప్రామణిక రుచులను (Authentic Indian food) ఆత్మీయంగా అందిస్తున్న మా 1000 ఉద్యోగుల కృషికి ఈ ఘనతకు అందిస్తున్నాం.
ఇంత వేగంగా ఎలా వృద్ధి చెందగలుగుతున్నారు మరియు అనేక ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో మీ కేంద్రాలను ఎలా ప్రారంభించుకోగలుగుతున్నారు అని మమ్మల్నిఅనేకమంది అడుగుతున్నారు. వారందరికీ మా సమాధానం మా ప్రియమైన భోజన ప్రియులు మరియు యువకులు మరియు ఉత్సాహవంతులైన బృందమే కారణం అని తెలియజేస్తున్నాం” అని జశ్వంత్ రెడ్డి ముక్కా మరియు తేజా చేకూరి వెల్లడించారు.
“గోదావరిలో పనిచేసే వారు మా దగ్గర లేరు. మా దగ్గర ఉన్నదల్లా గోదావరి కోసం మాతో కలిసి పనిచేసే వారు మాతో ఉన్నారు!! మేం ప్రస్తుతం 30 సంవత్సరాల వయసులోనే ఉన్నాం. మేం మరెంతో ముందుకు సాగాల్సి ఉంది. రాబోయే దశాబ్ధంలో విశ్వవ్యాప్తంగా మా సేవలను విస్తరిస్తామని మేం భరోసాతో ఉన్నాం” అని కౌశిక్ కోగంటి ధీమా వ్యక్తం చేశారు.
ఆత్మీయ రుచులను అందించడం పట్ల మీకు మమకారం ఉండి “గోదావరి” కుటుంబంలో చేరాలి అని అనుకుంటే మరియు అవకాశం తలుపులు తెరిచి స్వాగతం పలకాలని భావిస్తే… Franchise@GodavariUS.com కి ఈ మెయిల్ చేయండి.
“నేపర్విల్”లోని మా విశిష్ట కేంద్రం ప్రారంభం మరియు ఆకట్టుకునే బాంక్వెట్ హాల్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఈ వారంతంలో దక్షిణ భారతీయ రుచులతో మేం స్వాగతం పలుకుతున్నాం.
మా చిరునామా:
గోదావరి నేపర్విల్ (షికాగో)
1568, డబ్ల్యూ ఆగ్డెన్ ఏవ్,
నేపర్విల్, ఇలినాయిస్- 60540
630-536-8798
సంప్రదించండి:
Varun Madisetty
630-340-9760
Naperville@GodavariUS.com
Press release by: Indian Clicks, LLC