నందమూరి బాలకృష్ణకు పురాణ ఇతిహాసాలపై పట్టు ఎక్కువ. ఆయన్ని కదిలిస్తే, రామాయణ మహాభారతాల్ని వల్లిస్తుంటారు. శ్లోకాలు పాడతారు. పిట్ట కథలు చెబుతారు. ఇప్పుడు తెరపైనా…. తన టాలెంట్ ని చూపించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `అఖండ`. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్న సంగతి తెలిసిందే. అఘోరాగా ఓ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల అఘోరా గెటప్‌ని రివీల్ చేశాడు బోయపాటి. దానికి మంచి స్పందన వచ్చింది.
ఈ అఘోరా పాత్ర… పలికే సంభాషణల్లో చాలా వరకూ సంస్క్రృత శ్లోకాలే వినిపించబోతున్నాయట. వాటిని బాలయ్య పాట రూపంలోనూ పాడారని వినికిడి. అయితే ఆయా శ్లోకాల్ని సందర్భానుసారం వాడారని, వాటి అర్థాన్ని సైతం విడమరచి చెబుతారని ఇన్ సైడ్ వర్గాల టాక్. అఘోరా పాత్రే అయినా… దాన్ని తన స్వభావానికి అనుకూలంగా బోయపాటి మలిచాడని, అది నచ్చే ఈ పాత్ర చేయడానికి బాలయ్య ఒప్పుకున్నారని సమాచారం. మొత్తానికి బాలయ్య నుంచి పసందైన శ్లోకాల్ని వినడానికి అభిమానులు రెడీ అయిపోవచ్చన్నమాట.