ప్రజలు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన చోట పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. వారి ముందు ఇటీవలి కాలం వరకూ స్టాక్ మార్కెట్ ప్రాధాన్యతా స్థానంలో ఉండేది కాదు. కానీ గత నాలుగైదేళ్ల కాలంలో స్టాక్ మార్కెట్ భూమ్, రిటర్నులు ఊహించని విధంగా వస్తున్నాయన్నారు అభిప్రాయంతో ఎక్కువ మంది ట్రేడింగ్ ప్రారంభించారు. ఈ కారణంగా బంగారం, రియల్ ఎస్టేట్ లోకి రావాల్సిన పెట్టుబడుల్లో కొంత మేర స్టాక్ మార్కెట్ కు వెళ్లాయి.
అయితే రిస్క్ ప్రకారం చూస్తే స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. కానీ బంగారం, రియల్ ఎస్టేట్ విషయాల్లో మాత్రం మన డబ్బుకు ఢోకా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు. బంగారం విలువ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల కన్నా ఎక్కువగా పెరుగుతోంది. తగ్గుతాయి అని ఎవరు విశ్లేషణలు చేసినా.. ఆ తగ్గినదానికి రెట్టింపు పెరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం.
భూమిని నమ్ముకున్న వారు నష్టపోయినట్లుగా చరిత్రలో లేదని చెబుతారు. అయితే ఏదైనా మార్కెట్ కు తగ్గట్లుగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఎలా చూసినా స్టాక్ మార్కెట్ కన్నా.. బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులే సురక్షితం. ముఖ్యంగా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్న వారు.. వాటిని నష్టపోయే భయం స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా ఉంటుంది.