తిరుమల శ్రీవారికి చెందిన వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమైన వ్యవహారం.. కలకలం రేపుతోంది. అది కూడా నేరుగా శ్రీవారి ట్రెజరీ నుంచి.. వాటిని దొంగిలించుకు వెళ్లారు. వెండి కిరీటం బరువు ఐదు కేజీలుగా గుర్తించారు. మరో రెండు ఉంగరాల బరువు ఎంత అనేదానిపై.. టీటీడీ అధికారులు.. గోప్యంగా ఉంచుతున్నారు. అసలు ఈ కిరీటం, ఉంగరాల మాయం వ్యవహారాన్ని.. కొద్ది రోజుల నుంచి టీటీడీ అధికారులు తొక్కి పెట్టారు. ఏఈవో గా పని చేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని..ఈ దొంగతనానికి బాధ్యుడ్ని.. అతని వద్ద నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నారు. అతని జీతం నుంచి ప్రతీ నెలా.. కొంత కొంత.. వసూలు చేస్తున్నారు.
ట్రెజరీ నుంచి తీసుకెళ్లగలిగేది ఎవరు..?
శ్రీవారి ఆభరణాలు దాచే ట్రెజరి అంటే… ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. అలాంటి చోట నుంచి గ్రాము బంగారం పోయినా… అత్యున్నత స్థాయిలో సంచలనం సృష్టిస్తుంది. అలాంటిది.. ఐదు కేజీల వెండి, రెండు బంగారు ఉంగరాలు మాయం కావడం కలకలం రేపుతోంది. బయటపడినప్పటికీ.. రహస్యంగా ఉంచడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్తగా వచ్చిన అధికారులు.. ఈ వ్యవహారంలో చక్రం తిప్పారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రెజరీ నుంచి.. ఇతరులెవరూ… చిన్న ఆభరణం కూడా బయటకు తీసుకెళ్లలేరని.. అత్యున్నత స్థాయిలోనే.. ఈ దొంగతనం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
అసలు దొంగలెవరు..?
వెండి కిరీటం, రెండు ఉంగరాలు మాయమైన తర్వాత ఎవరైనా.. అసలు దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ టీటీడీ ఉన్నతాధికారులు మాత్రం… వేరే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు దొంగతనం చేసినా పర్వాలేదు.. కానీ వాటికి తగ్గ ధరను రికవరీ చేస్తే పర్వాలేదన్నట్లుగా వ్యవహరించారు. ఏఈవో శ్రీనివాసులును బలి పశువును చేసి.. అతని జీతం నుంచి రికవరీ చేస్తున్నారు. అసలు… ఆ వెండి కిరీటాన్ని, ఉంగరాలను ఎవరు తీసుకెళ్లారు..? ఎలా తీసుకెళ్లారు..? భద్రతా ఏర్పాట్లు.. అంత సులువుగా.. కిరీటాలను.. ఉంగరాలను తీసుకెళ్లేంత పేలవంగా ఉన్నాయా…? లాంటి అంశాలు ఇప్పుడు.. కలకలం రేపుతున్నాయి.
టీటీడీ గోప్యత ఎవర్ని కాపాడటానికి…!?
టీటీడీ విషయం ఏం జరిగినా రాజకీయం దుమారం రేగుతుంది. ఎందుకంటే.. టీడీపీలో ఎక్కువగా రాజకీయ నియామకాలే ఉన్నాయి. ప్రభుత్వం మారగానే… టీటీడీలోకి పలువురు కీలక అధికారులు వచ్చి చేరారు. టీటీడీ చైర్మన్ కూడా కొత్త నేత వచ్చారు. పాలక మండలి ఇంకా నియామకం కాలేదు. ఈ లోపే… కిరీటం, ఉంగరం మాయం కావడంతో… సహజంగానే రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై… భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు టీటీడీలో ఏం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
బయటకు తెలియకుండా ఎన్ని తరలిపోయాయి…?
వైసీపీ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు.. శ్రీవారి బంగారాన్ని టీడీపీ నేతలు తరలించారని ఆరోపించారు. మొత్తం బయటపెడతామన్నారు. ఇప్పుడు.. వారి హయాంలోనే.. నేరుగా ట్రెజరీ నుంచి వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై.. ఇప్పుడు వారు భక్తులకు సమాధానం చెప్పాల్సి ఉంది. అసలు దొంగల్ని పట్టుకోకుండా.. ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు…? తెలిసింది కాబట్టి.. వెండి కిరీటం.. ఉంగరాల సంగతి బయటపడింది.. ఇలా తెలియకుండా.. ఇంకెన్ని తరలిపోయాయి…? ఇవన్నీ భక్తుల్లో వస్తున్న సందేహాలు. వీటిని టీటీడీ తీరుస్తుందా..?