ఓ సినిమా చేయడమంటే… యేడాది ప్రయాణం మాత్రమే కాదు. కనీసం రెండొందల మందితో చేసే స్నేహం. యేడాది పాటు ఓ టీమ్‌తో కలసి కష్టపడడం. అందుకే.. సెట్లో చివరి రోజు భావోద్వేగాల భరితంగా సాగుతుంది. అందుకే చివరి రోజున చాలామంది ఎమోషనల్‌గా ఫీలవుతారు. కీర్తి సురేష్ కూడా అంతే. ఈమధ్య ప్రతీ సినిమానీ ఓ ఎమోషనల్ జర్నీగా తీసుకుంటోంది కీర్తి. ‘మహానటి’ సెట్లో చివరిరోజు కన్నీటి పర్యంతమయ్యింది. ఆ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ చిన్న చిన్న బహుబతులు ఇచ్చి.. వాళ్ల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ‘పందెం కోడి 2’ సినిమాకీ అలానే చేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ పూర్తయింది.చివరి రోజున కీర్తి సెట్లో ఉన్నవాళ్లందరికీ బంగారు నాణాలు పంచిందట. దాదాపు 150 నాణాలను కీర్తి పంచిపెట్టిందని టాక్. ఇది నిజంగా మంచి అలవాటే. కీర్తిని చూసి స్ఫూర్తి పొందిన విశాల్ కూడా బంగారు నాణాల పంపకం మొదలెట్టాడట. తను కూడా 150మందికి నాణాలు పంచిపెట్టాడట. మొత్తానికి పందెంకోడి టీమ్ అదృష్టం చేసుకుంది. హీరో, హీరోయిన్లు బంగారు నాణాలతో ముంచెత్తేశారు. లింగు స్వామి దర్శకత్వం వహించిన చిత్రం త్వరలో విడుదల కానుంది.