వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రి ఆలయాన్ని వైభవంగా పునం ప్రారంభించాలని నిర్ణయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించాలని సంకల్పించారు. దీనికి 125కిలోల బంగారం అవసరం అవుతుంది. ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టగలిగినప్పటికీ భక్తులకూ చాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. మొట్ట మొదటి విరాళంగా కేసీఆక్ తన కుటుంబ తరపన 116 తులాల బంగారాన్ని ప్రకటించారు.
కేసీఆర్ ఇలా ప్రకటించిన వెంటనే.. ఇతర నేతల ప్రకటనలు హోరెత్తాయి. ఇటీవ ఐటీ దాడుల్లో వందల కోట్ల బ్లాక్ మనీ బయటపడిన హెటెరో అధినేత పార్థసారధి రెడ్డి రూ. ఐదు కేజీల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరపున ఒక కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారం, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కిలోల బంగారం, కావేరీ సీడ్స్ అధినేత కావేరీ భాస్కర్ రావు 1 కిలో, నమస్తే తెలంగాణ దామోదర్ రావు కుటుంబం నుంచి 1 కిలో, చినజీయర్ పీఠం నుంచి 1 కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కేజీ , మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎ ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వారి కుటుంబ సభ్యులు కలసి కేజీ బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇక ఏపీ నుంచి కేసీఆర్ పిలుపనకు స్పందన వస్తోంది. వైసీపీ నేత… కడప జిల్లా చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ కేజీ బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల నుంచి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒక్కో గ్రామం నుంచి రూ.11 ఇచ్చినా సరిపోతుందని, తెలంగాణ ప్రజలందరి నుంచి ఈ భావన రావాలని ముఖ్యమంత్రి కోరారు. స్వయంగా ముఖ్యమంత్రే కోరారు కాబట్టి 125 కేజీల కన్నా ఎక్కువే బంగారం యాదాద్రి ఆలయానికి సమకూరే అవకాశం కనిపిస్తోంది.