సామాన్యులు ఎక్కువ మంది ముందుగా తాము కష్టపడి సంపాదించే సొమ్మును స్థలాలు, ఇళ్లు లేకపోతే బంగారంలో పెట్టుబడి పెడతారు. అవి అయితే కళ్ల ఎదురుగా ఉంటాయి. అవసరమైనప్పుడు మా డబ్బులు మాకివ్వండి అని ఎవర్నీ అడగాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లెక్సిబులిటీతో పాటు ఈ రెండు రంగాల్లోనూ రిటర్నులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో కంపేరిజన్ వస్తే ఎందులో మంచి పెట్టుబడి అన్న ప్రశ్న వస్తోంది. దీనికి కారణం బంగారం ధరలు ఊహించని విధంగా పెరుగుతూండటమే.
రియల్ ఎస్టేట్ రంగం వృద్ది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అమరావతిలో ఒకలా.. హైదరాబాద్ లో మరోలా ఉంటుంది. అమరావతిలో అన్ని చోట్లా ఒకేలా వృద్ధి సాధించకపోవచ్చు. అలాగే హైదరాబాద్ లో కూడా. ఐటీ కారిడార్ వైపు ఉండేంత ధరలు విజయవాడ హైవే వైపు ఉండవు. ఇప్పుడు స్థలం కొని పదేళ్ల తర్వాత మన పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అంటే.. రియల్ ఎస్టేట్ కాస్త సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పెట్టుబడి.
కానీ బంగారం అలా కాదు. రోజువారి వృద్ధి కనిపిస్తుంది. అప్పుడప్పుడు ధరలు తగ్గినా అది తాత్కాలికమే. బంగారం తగ్గుదల అనేదే ఉండదు. పైగా ఇటీవలి కాలంలో ఎవరూ ఊహించనంతగా పెరుగుతోంది. పది గ్రాముల బంగారం 90వేలు అవుతుందని ఎవరైనా ఊహించగలరా?. పదేళ్ల కిందట అది ముఫ్పై వేల దగ్గరే ఉండేది. ఇంత హై రిటర్నులు ఇచ్చే పెట్టుబడి రంగం మరేదీ ఉండదు. ఐదేళ్లలో పెట్టుబడిని రెట్టింపు చేసేది ఒక్క గోల్డ్ మాత్రమే. అంతే కాదు..లిక్విడిటీకి సమస్య ఉండదు.
రియల్ ఎస్టేట్ దీర్ఘకాలంలో లాభాలు వస్తాయి కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం అంత కాదు. కానీ దీర్ఘకాలంలో స్థలాలు, ఇళ్లు కూడా మంచి పెట్టుబడే.