గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. తాజాగా బుధవారం కూడా బంగారం ధర మోస్తరుగా తగ్గింది. గోల్డ్ రేట్ తగ్గుతోందని సంబరపడుతుండగానే మరికొద్ది రోజుల్లోనే అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది భారత్ లో బంగారం వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఇదే జరిగితే దేశంలో బంగారం ధరలు మరింత పెరగడం పక్కా అని తెలుస్తోంది.
రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ పెరుగుతాయని దాంతో వివాహ, శుభ కార్యాలు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 75 వేల స్థాయిని దాటి ఆల్ టైం గరిష్ట స్థాయిని నమోదు చేసే అవకాశం ఉందని , ఒకవేళ అదే కొనసాగినట్లయితే బంగారం నూతన గరిష్ట స్థాయిని అందుకునే అవకాశం ఉందంటున్నారు.
ప్రధాన నగరాలైన హైదరాబాద్ , విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గి రూ. 72,760 ఉండగా..22క్యారెట్ల బంగారం ధరపై రూ.10కు తగ్గి రూ.66,690 ఉంది. వెండి ధర కిలో 90,000గా ఉంది.