బంగారం ధరలు భారీగా పెగిగిపోతున్నాయి. ఏడాది, ఏడాదికి రేట్లు పైపైకి వెళ్తున్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనే పరిస్థితి మెల్లగా సన్నగిల్లడంతో పాటు ఒకప్పుడు మేమూ బంగారు ఆభరణాలు ధరించేవాళ్ళం అని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.
పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. పెళ్లిలో అయితే తులాల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, రానున్న కాలంలో బంగారం అరుదుగా కొనే పరిస్థితి రావొచ్చునని తెలుస్తోంది.
మరో 9ఏళ్లలో 10గ్రాముల బంగారం ధర 2లక్షలకు చేరే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు. ప్రతి తొమ్మిదేళ్లకు బంగారం ధరలు 3 రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం 10 తులాల బంగారం ధర 70వేలకు పైగా ఉంది. దాంతో వచ్చే తొమ్మిదేళ్లనాటికి అది 2.1 లక్షలకు చేరవచ్చునని అంచనా వేస్తున్నారు.
2015లో పది గ్రాముల బంగారం ధర 24,740 ఉండగా, 2023నాటికి అది మూడు రేట్లు పెరిగిందని.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో బంగారం సంపన్నుల వద్ద మాత్రమే కనిపించే అరుదైన ఆభరణంగా మారబోతుందా..?అనే టాక్ వినిపిస్తోంది.