మైత్రి మూవీ మేకర్స్ తమిళ స్టార్ అజిత్ కుమార్ తో చేస్తున్న సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. నిజానికి సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. అయితే నిర్మాతలు పుష్ప 2 కారణంగా ఈ సినిమాకి సమయం కేటాయించలేకపోయారు. ఇప్పుడు ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
ఈ రోజు తెలుగు టీజర్ వదిలారు. అజిత్ మార్క్ ని చూపిస్తూ హీరోయిక్ ఎలివేషన్ తో టీజర్ కట్ చేశారు. ‘ఏకే ఒక రెడ్ డ్రాగన్. వాడి రూల్స్ ని వాడే బ్రేక్ చేసి వచ్చాడంటే వాడి నిప్పుల శ్వాసతో మొత్తం తగలబెడతాడు’ ఇలాంటి మాస్ ఎలివేషన్ తో అజిత్ పాత్ర పరిచయమైయింది.
యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఇది. అజిత్ క్యారెక్టరైజేషన్ లో చాలా వేరియెషన్స్ వున్నాయి. ఆయన శ్వాగ్, గెటప్పులు అభిమానులని అలరించేలా వుంది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ప్రకాష్ కుమార్ యాక్షన్ సరితూగింది. టీజర్ అయితే ఫ్యాన్స్ ని ఖుషి చేసేలానే వుంది. అజిత్ కి సాలిడ్ హిట్ పడి చాలా కాలమైయింది. ఈ సినిమాతో ఆ హిట్ వస్తే మైత్రీ మూవీ మేకర్స్ కి అంతకంటే ఆనందం మరొకటి వుండదు.