రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే అతి పెద్ద మోసం అన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలంగా ఉంది. దీనికి కారణం చాలా మంది బిల్డర్లు.. చెప్పేదొకటి.. చేసేదొకది.కొంత మంది ఎస్ఎఫ్టీల దగ్గర మోసం చేస్తారు..మరికొంత మందిఅసలు లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి అమ్మేసి మోసం చేస్తారు. ప్రీ లాంచ్ ఆఫర్లు, బైబ్యాక్ ఆఫర్లతో మోసం చేసేవారు మిరకొందరు. ఇలా గత ఏడాది కొన్ని వేల మందిమోసపోయారు. తమ జీవిత కాల కష్టాన్ని కోల్పోయారు. వారిపై కేసులు పెట్టడం వల్ల ఎలాంటిలాభం ఉండదు..కానీ డబ్బు రికవరీ మాత్రం అంత తేలిక కాదు.
తాము జీవితాంతం కష్టపడిన వాటిని వివాదాల్లో పెట్టుబడిగా పెట్టాలని మధ్యతరగతి ప్రజలు అసలు అనుకోరు. కాస్త తక్కువకు వస్తాయని ఆశ పడిన వారిని నిట్టనిలువుగా ముంచేందుకు కొంత మంది దేనికైనా తెగిస్తున్నారు . ఇలాంటి వారి వల్లనే అసలు రియాల్టీ పరిశ్రమలో ఏ సంస్థను లేదా వ్యక్తుల్ని నమ్మాలంటే సమస్యలు వస్తున్నాయి. చిన్న బిల్డర్లు చేసే మోసాలకు అంతు ఉండటం లేదు. అత్యంత చీప్ నిర్మాణ సామాగ్రిని వాడుతూ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు శ్లాబ్‌లకు రోబోశాండ్ మాత్రమే వాడుతున్నారు. కానీ ఇసుక వాడామని చెప్పి నమ్మిస్తారు. ఇక అత్యంత కీలకమైన ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు కూడాచీప్ వాటితో కానిచ్చేస్తున్నారు. ఫలితంగా వెంటనే సమస్యలు వస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంటే బంగారు బాతు. అందులో ఉన్న వారందరికీ సిరులు కురిపిస్తాయి. దాన్ని మోసాల ద్వారా చంపేసుకుని తాత్కలిక లాభాలు పొందాలనుకునేవారి వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివారికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావడంలేదు. ప్రతీ ఏడాది వేల మంది మోసపోతున్నారు. ఈ సారి అలాంటి మోసాలను పరిమితం చేస్తే .. రియల్ ఎస్టేట్ పై ప్రజల నమ్మకం పెరుగుతుంది.