చంద్రబాబుపై ఎంతో నమ్మకంతో ఏపీ ప్రజలు కూటమి సర్కార్ కు ఘన విజయం కట్టబెట్టారు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తూ సీఎంగా చంద్రబాబు మొదటి ఐదు సంతకాలు చేశారు. అయితే, ఆయన పాలన 2014లో సాగినంత ఈజీ కాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వైసీపీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం అయింది. ముందు చూపులేని నిర్ణయాలతో రాష్ట్రం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది వైసీపీ. ఈ నేపథ్యంలో విజినరీ అని చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. దీంతో కూటమి సర్కార్ కు అప్పుల సమస్యలు, సవాళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. వీటిని ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టించడం అంత తేలికేం కాదు.
ప్రధానంగా అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాల్సి ఉంది. ఇందుకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. ఇక, వైసీపీపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి ప్రధాన కారణం. రోడ్ల అధ్వాన పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటివి చక్కదిద్దాల్సి ఉంది. యువతకు ఉపాధి కల్పన కూడా సవాల్ గా మారనుంది.
ప్రతి నెల ఎనిమిది , తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఫించన్లకే వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో చంద్రబాబుకు సవాళ్ళు స్వాగతం పలుకుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప రాష్ట్రాన్ని ఈ సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే, చంద్రబాబు పాలనా అనుభవం, సంపదనను సృష్టించడంలో మేటి అని పేరు ఉండటంతో ఆయన తీసుకునే నిర్ణయాలతో ఏపీని సవాళ్ళను నుంచి గట్టెకిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.