చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ సి.ఈ.ఓ.గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా ‘గూగుల్ ఫర్ ఇండియా’ అనే కార్యక్రమంలో భాగంగా భారత్ కి వచ్చేరు. ఈ సందర్భంగా ఆయన భారత్ లో తాము చేపట్టబోయే అనేక పధకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా:
1.దక్షిణాసియాలోనే అతిపెద్దది మరియు అమెరికా వెలుపల గూగుల్ కార్యాలయాలలోకెల్లా అతి పెద్దది అయిన అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తుంది. భారత్ అవసరాలకు తగినట్లుగా అక్కడ గూగుల్ ఉత్పత్తుల తయారు చేస్తారు. బెంగళూరులో ఉద్యోగుల సంఖ్యను ఇంకా పెంచుతుంది.
2.భారతీయ రైల్వేలతో కలిసి గూగుల్ సంస్థ దేశ వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో వైఫీ సౌకర్యం కల్పిస్తుంది.
3.ఇంజనీరింగ్ మరియు వాణిజ్య రంగాలలో గూగుల్ పెట్టుబడులు పెడుతుంది.
4.దేశంలో మూడు లక్షల గ్రామాలకు చౌకగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ‘బెలూన్ టవర్స్’ ఏర్పాటు చేయబడతాయి.
5.11 భారతీయ బాషలలో సులువుగా టైప్ చేసుకొనేందుకు వీలుగా రూపొందించిన వర్చువల్ కీ బోర్డు త్వరలో విడుదల.
6.దేశ వ్యాప్తంగా ఉన్న 30 విశ్వవిద్యాలయాలు, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి వచ్చే మూడేళ్ళలో దేశంలో 20 లక్షల మందికి ఆండ్రాయిడ్ డెవలపర్లుగా శిక్షణ.